Asianet News TeluguAsianet News Telugu

మంచి మనస్సు చాటుకున్న ‘జైలర్’ నిర్మాత.. ఉపాసన తాతగారికి రూ.కోటి అందజేత.. ఎందుకంటే?

‘జైలర్’ మూవీ ఇచ్చిన సక్సెస్ తో నిర్మాత కళానిధి మారన్ ఫుల్ హ్యపీగా ఉన్నారు. దీంతో పేదలకు ఉపయోగపడేలా అపోలో హస్పిటల్స్ కు రూ.కోటి చెక్ విరాళంగా అందించి మంచి మనస్సు  చాటుకున్నారు.
 

Jailer movie Producer Kalanithi handed overa a cheque for one crore to dr. Prathap Reddy NSK
Author
First Published Sep 6, 2023, 12:07 PM IST


సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ‘జైలర్’ తో వచ్చిన విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ యాక్షన్ కామెడీ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి ఇప్పటి వరకు దాదాపుగా రూ.700 కోట్ల గ్రాస్ వచ్చింది. సినిమాకు పెట్టిన ఖర్చులో మూడున్నర రెట్లు తిరిగి రావడంతో నిర్మాత కళానిధి మారన్ (Kalanithi Maran)  చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

‘జైలర్’ సినిమా తెచ్చి పెట్టిన లాభాల్లో నటీనటులకు చెక్ రూపంలో, కాస్ల్టీ కార్లను అందజేస్తూ ఖుషీ చేస్తున్నారు. ఇప్పటికే రజినీకాంత్ కు రూ.110 కోట్లు అదనంగా చెక్ అందించారు. అలాగే నెల్సన్ కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా పోర్ష్ కారును గిఫ్ట్ గా అందించారు. అలాగే నటీనటులు, చిత్ర యూనిట్ కు కూడా తగిన విధంగా గిఫ్ట్ లు అందిస్తూ సక్సెస్ ను ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక తాజాగా అపోలో హస్పిటల్స్ చెర్మెన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డికి రూ.కోటి చెక్ ను విరాళంగా అందించినట్టు సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. ఉపాసన తాతగారైన ప్రతాప్ రెడ్డికి చెక్కు ఇవ్వడం పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు. 

సన్ పిక్చర్స్ తరపున శ్రీమతి కావేరి కళానిధి, అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డికి 100 మంది లోపు చిన్నారుల గుండె శస్త్రచికిత్స  కోసం రూ.1 కోటి చెక్కును అందజేసినట్టు తెలిపారు. దీంతో ఆయన మంచి మనస్సును నెటిజన్లు అభినందిస్తున్నారు. సినిమా సక్సెస్ తో సేవా కార్యక్రమాలకూ పూనుకోవడం హర్షనీయమంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఇక జైలర్ చిత్రం సాధించిన వసూళ్లతో కోలీవుడ్ థర్డ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా రికార్డు క్రియేట్ చేసింది. మరోవైపు ఈ చిత్రంతో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా రజినీకాంత్ సరికొత్త రికార్డు సెట్ చేశారు. ఈ చిత్రంలో నటించిన రమ్యకృష్ణ, మిర్నా మీనన్, విలన్ పాత్రలో నటించిన వినాయకన్ కు మంచి గుర్తింపు దక్కింది. చిత్రానికి అనిరుధ్ అందించిన మ్యూజిక్, బీజేెఎం నెక్ట్స్ లెవల్లో ఉంది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ అతిథిపాత్రల్లో నటించడం సినిమాకు మరింత ప్లస్ గా మారింది. మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా నటించిన ‘నువ్వు కావాలయ్యా’ ఐటెం సాంగ్ ఏ లెవల్లో ట్రెండ్ అయ్యిందో తెలిసిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios