ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తో అనే ప్రచారం జరుగుతోంది. ఇంకా ప్రాజెక్టు అయితే ఖరారు కాలేదు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తో అనే ప్రచారం జరుగుతోంది. ఇంకా ప్రాజెక్టు అయితే ఖరారు కాలేదు. అట్లీ ప్రాజెక్టు ఆల్మోస్ట్ కంఫర్మ్ అయింది. కానీ బడ్జెట్, రెమ్యునరేషన్ సమస్యల వల్ల అట్లీ తప్పుకున్నాడు.
దీనితో బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అనే సందేహం ఇంకా వీడలేదు. పుష్ప తర్వాత తప్పకుండా బన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టు మాత్రమే చేస్తాడు. కాబట్టి భారీ కథ అవసరం. అలాంటి డైరెక్టర్ కూడా కావాలి.
అట్లీ తప్పుకోవడంతో మరో క్రేజీ తమిళ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. రజనీకాంత్ కి జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నెల్సన్ దిలీప్ కుమార్. తాజా సమాచారం మేరకు నెల్సన్ ఇటీవల అల్లు అర్జున్ ని కలిశారట.
నెల్సన్ చెప్పిన స్టోరీకి బన్నీ బాగా ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. వైవిధ్యంగా సినిమాలు తీయడంలో నెల్సన్ దిట్ట. బన్నీతో నెల్సన్ ఒక యాక్షన్ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే పుష్ప 2 తర్వాత బన్నీ నటించేది నెల్సన్ దర్శకత్వంలోనే కావచ్చు.
