వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ బుధవారం రోజు ముంబైలో అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న కంగనను అడ్డుకునేందుకు శివసేన వర్గాలు ప్రయత్నిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ బ్యూటీ వై క్యాటగిరి భద్రతను ఇచ్చింది.

ముఖ్యంగా ముంబై మినీ పాకిస్థాన్‌లా తయారైందంటూ కంగన చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వ వర్గాలు ముఖ్యంగా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కంగన మాత్రం తన వ్యాఖ్యల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఈ రోజు ముంబైలో అడుగుపెడుతున్న సందర్భంగా కంగన ఆసక్తికర ట్వీట్ చేసింది.

`నేను ధైర్యం, శౌర్యం, త్యాగానికి ప్రతీక అయిన లక్ష్మీ భాయ్‌ పాత్రలో నటించాను. ఈ రోజు నన్ను నా సొంత రాష్ట్రం మహారాష్ట్రకు రాకుండా అడ్డుకుంటున్నారు. కానీ నేను రాణీ లక్ష్మీ భాయ్‌ మార్గంలోనే నడుస్తాను. అన్యాయాలకు వ్యతిరేఖంగా నా గొంతును వినిపిస్తూనే ఉంటాను. జై మహారాష్ట్రా, జై శివాజీ` అంటూ ట్వీట్ చేసింది కంగనా. ముంబై ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంల కంగన ట్వీట్‌ ఆ వేడిన మరింతగా పెంచింది.