ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవకుశ కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తున్న జైలవకుశ స్పైడర్ తో పోటీపడి పాజిటివ్ టాక్ తో ముందంజ

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనత గ్యారేజ్ లతో హ్యాట్రిక్ విజయం సాధించిన ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. తాజాగా ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ తో మరో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాన్ రామ్ నిర్మించిన ‘జై లవ కుశ’ చిత్రంలో మొదటి సారిగా ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు. 

జైలవకుశ చిత్రంలో ముఖ్యంగా ‘జై’ పాత్ర విలన్ అయినా తన అద్భుతమైన నటనతో అందరి మనసు గెలిచాడు ఎన్టీఆర్. ఈ చిత్రంలో జై పాత్రకు అభిమానులు, ప్రేక్షకులు జై కొడుతున్నారు. సాధారణంగా విలన్ పాత్ర అంటే అందరూ వ్యతిరేకిస్తారు..కానీ జై పాత్రలో ఎన్టీఆర్ నటన చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. 

సెప్టెంబర్ 21న భారీ ఎత్తున రిలీజ్ అయిన జై లవకుశ భారీ ఓపెనింగ్స్ ని సాధించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రం ఇప్పటి వరకు 120 కోట్ల గ్రాస్ వసూళ్ల ని వసూల్ చేసిందని అంటున్నారు చిత్ర యూనిట్. అంతే కాదు 120 కోట్ల లో దాదాపుగా 72 కోట్ల షేర్ వచ్చింది దాంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 23 కోట్ల షేర్ వసూల్ చేస్తే బయ్యర్లంతా లాభాల బాటలోకి వెళతారు.

జై లవకుశ ఏరియాల వారీగా సాధించిన వసూళ్లు :

నైజాం - 15 కోట్లు ( షేర్ ) 

సీడెడ్ - 10. 92 కోట్లు 

కృష్ణా - 4. 25 కోట్లు 

గుంటూరు - 5. 67 కోట్లు 

ఈస్ట్ - 5 .10 కోట్లు 

వెస్ట్ - 3. 40 కోట్లు 

ఉత్తరాంధ్ర - 6. 05 కోట్లు 

నెల్లూరు - 2. 30 కోట్లు 

కర్ణాటక - 4. 75 కోట్లు 

తమిళనాడు - 1. 22 కోట్లు 

అమెరికా - 4. 62 కోట్లు 

రెస్ట్ ఆఫ్ ఇండియా - 5. 25 కోట్లు 

----------------------------------------------------------

మొత్తం షేర్ - 71. 82 కోట్ల షేర్ 

----------------------------------------------------------