బాలీవుడ్ కూడా సౌత్ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. డైరెక్ట్ గా సినిమాలను స్థానిక భాషల్లోకి డబ్ చేసి ఫ్యాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు వార్ సినిమా కూడా అదే తరహాలో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేసింది. హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ నటించిన వార్ మూవీ అక్టోబర్ 2న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. 

ఇకపోతే సినిమాకు సంబందించిన పాటలతో కూడా వార్ యూనిట్ ప్రమోషన్ లో డోస్ పెంచుతోంది. రీసెంట్ గా ఒక రొమాంటిక్ సాంగ్ తో టాలీవుడ్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసిన వార్ గ్యాంగ్ ఇప్పుడు జై జై శివ శంకర్ అనే పాటను తెలుగులో రిలీజ్ చేశారు. సాంగ్ లో హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. 

భారీ ఖర్చుతో తెరకెక్కించిన ఈ సాంగ్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక సినిమాలో ఎవరు ఊహించని భారీ యాక్షన్ సీన్స్ ఉన్నట్లు చిత్ర యూనిట్ బాగా ప్రమోట్ చేస్తోంది. దాదాపు 7 దేశాల్లో డిఫరెంట్ యాంగిల్స్ లో ఫైట్ సీక్వెన్స్ ని షూట్ చేసినట్లు చెప్పారు. మరి ఈ బిగ్ బడ్జెట్ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి