ప్ర‌పంచ‌వినాశ‌నానికి ప్ర‌య‌త్నిస్తోన్న అసురుల‌ను ఎదుర్కొనేందుకు హ‌నుమంతు ఎలాంటి సాహ‌సాలు చేశాడ‌న్న‌ది ఈ సీక్వెల్‌లో చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

వరల్డ్ వైడ్ గా హనుమాన్(HanuMan)చిత్రం క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు ఏమాత్రం ఎక్సపెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. సంక్రాంతికి వచ్చిన పెద్ద సినిమాలు అన్ని ప్రక్కకు పోగా హనుమాన్ విశ్వరూప ప్రదర్శనం చేసింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.330 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ కు షాక్ ఇచ్చింది. ఓవర్ సీన్ లో అయితే హనుమాన్ కలెక్షన్స్ విద్వంసమే. అక్కడ ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మరో ప్రక్క హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందని అందురూ ఎదురుచూస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని భావిస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం మేరకు 2025 లో రావటం కష్టమే అంటున్నారు.

అయితే జై హనుమాన్ కన్నా ముందు ప్రశాంత్ వర్మ ఇప్పటికే కమిటైన అధీర, మహాకాళి సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరం పూర్తి చేసి జై హనుమాన్ షూటింగ్ ప్రారంభించాలి. దాంతో జై హనుమాన్ ను 2025 రిలీజ్ అని ప్లాన్ చేసినా సినిమా రిలీజ్ కన్నా పెరిగిన అంచనాలను అందుకునేలా తీయడం ముఖ్యం అని భావిస్తోంది చిత్ర యూనిట్. అంతేకాదు హనుమాన్ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో జై హనుమాన్ ని కావాల్సినంత బడ్జెట్ లో తీసే అవకాశం ఉంటుంది.

ఈ విషయమై తేజ సజ్జా రీసెంట్ గా జరిగిన మీడియా ఇంట్రాక్షన్ లో క్లారిటీ ఇచ్చారు. జై హనుమాన్ చిత్రం కు లేటు అవుతుందని, ఈ లోగా తాను ఈ గ్యాప్ లో చాలా సినిమాలు చేయాల్సి ఉంటుందని అన్నారు. అలాగే 2025 లో సాధ్యం కాకపోవచ్చు అని, లార్జ్ స్కేల్ మూవీ కావటంతో టైమ్ పడుతుందని అన్నారు. 2026లోనే సినిమా రిలీజ్ ఉండవచ్చు అంటున్నారు. సీక్వెల్ కూడా హ‌నుమాన్ త‌ర‌హాలోనే గ్రాఫిక్స్‌, వీఎఫ్ఎక్స్ ప్ర‌ధానంగా పాత్ర పోషించనున్న‌ట్లు స‌మాచారం. హ‌నుమాన్‌కు మించి సీక్వెల్‌లో సూప‌ర్ హీరోగా తేజా స‌జ్జా పాత్ర సాగుతుంది. 

హనుమాన్ లో స‌ముద్ర‌ఖ‌ని క్యారెక్ట‌ర్ ద్వారా సీక్వెల్ పాయింట్‌ను చెప్పించాడు డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ప్ర‌పంచ‌వినాశ‌నానికి ప్ర‌య‌త్నిస్తోన్న అసురుల‌ను ఎదుర్కొనేందుకు హ‌నుమంతు ఎలాంటి సాహ‌సాలు చేశాడ‌న్న‌ది ఈ సీక్వెల్‌లో చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

Read more: ప్రభాస్‌ ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేక్‌ అయ్యే వార్త.. `సలార్‌ 2` ఇప్పుడే కాదా?.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ లో సంతోషం..