Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య నెక్స్ట్ కి ఆ టైటిల్? నిజమే అయితే మామూలుగా ఉండదు

బాలకృష్ణ సినిమా కోసం ‘జై బాలయ్య’ (Jai Balayya) అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు సమాచారం.  అభిమానులు ఎప్పుడూ  జై బాలయ్య అంటూంటారు. అది జనాల్లోకి వెళ్ళిపోయింది. దాంతో ఇపుడు అదే టైటిల్‌ను ఈ సినిమాకు ఫిక్స్ చేస్తే.. ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారట.  

Jai Balayya Registered For NBK107?
Author
Hyderabad, First Published Oct 12, 2021, 1:04 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

 నందమూరి బాలకృష్ణ త్వరలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా కోసం ఇప్పటికే అనేక టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసారని వినపడుతోంది. అది సినిమాకు యాప్ట్ అయ్యే పవర్‌ఫుల్ టైటిల్‌ అంటున్నారు.  మొదట ఈ సినిమాకు ‘రౌడీయిజం’ అనే టైటిల్‌ను పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ టైటిల్ పై జరుగుతున్న ప్రచారాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు ఖండించారు.మేమే సరైన సమయంలో టైటిల్ ఏంటో ప్రకటిస్తామని చెప్పారు. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటి..

బాలకృష్ణ సినిమా కోసం ‘జై బాలయ్య’ (Jai Balayya) అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు సమాచారం.  అభిమానులు ఎప్పుడూ  జై బాలయ్య అంటూంటారు. అది జనాల్లోకి వెళ్ళిపోయింది. దాంతో ఇపుడు అదే టైటిల్‌ను ఈ సినిమాకు ఫిక్స్ చేస్తే.. ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారట.  త్వరలోనే ఈ టైటిల్‌ను కూడా అఫీషియల్‌గా ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ టాక్ వాస్తవంగా ఇది ఎంతమేర నిజం అవుతుందో చూడాలి. 

Also read మంచి మెటీరియల్ దొరికిందన్న చిరు.. విష్ణు, ప్రకాష్ రాజ్ పై బాలయ్య కామెంట్

ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్ పాత్ర అయితే.. మరోకటి పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర అని చెబుతున్నారు. ‘చెన్నకేశవరెడ్డి’ తరహాలో తండ్రి కొడుకులు నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో మరో పవర్‌ఫుల్ లేడీ క్యారెక్టర్ కోసం వరలక్ష్మి శరత్ కుమార్‌ను తీసుకున్నారు.

ఈ  సినిమాలో.. బాలయ్య ఓ పల్నాటి చరిత్ర కారునిలా కనించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడిదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. యాక్షన్ సినిమాలను ఫర్ఫెక్ట్‌గా తెరకెక్కించే గోపీచంద్ మలినేని… బాలయ్య కోసం ఓ పల్నాటి వీరుని కథను సిద్దం చేశారట. ఇక ఈ స్టోరీని అనుకున్న తరువాత.. బాలయ్య రూపం.. ఆవేశమే గుర్తుకు వచ్చిందట. అందుకే ఈ సినిమాను ఎలాగైనా బాలయ్యతోనే తెరకెక్కించాలని పకడ్భందీగా బౌండెడ్ స్క్రిప్ట్ తో ఆయన్ని కలిసి ఓకే చేయించుకున్నారని చెప్తున్నారు.
 
 మరో ప్రక్క  బాలకృష్ణ రీసెంట్ గానే తన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ “అఖండ” షూట్ అంతా కంప్లీట్ చేసేసారు. దర్శకుడు బోయపాటి శ్రీనుతో ప్లాన్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతుంది. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాతో హాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఉగాది సందర్భంగా విడుదలైన ’అఖండ’(Akhanda) టైటిల్ పోస్టర్‌తో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.అంతేకాదు టాలీవుడ్‌లో తక్కువ టైమ్‌లో 50M వ్యూస్ క్రాస్ చేసిన టీజర్‌గా బాలకృష్ణ ‘అఖండ’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. 
Also read అమితాబ్‌ రేర్‌ పిక్స్ః చిరు, బాలయ్య, నాగ్‌, మహేష్‌, ప్రభాస్‌, పవన్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టిలతో ఫోటోలు వైరల్‌

Follow Us:
Download App:
  • android
  • ios