అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్‌ షూటింగ్‌ సెట్‌లో చిల్‌ అయ్యింది. ఈ వీడియోని పంచుకుంటూ అభిమానులను చిల్‌ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు `గుడ్‌లక్‌ జెర్రీ` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం పంజాబ్‌లో శరవేగంగా జరుగుతుంది. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ సెట్‌లో ఓ ఫన్నీ సీన్‌ చోటు చేసుకుంది. షూటింగ్‌ మధ్యలో జాన్వీ కపూర్‌ ఓ ఫన్నీ ఎపిసోడ్‌కి తెరలేపింది. 

ఈ-ఆటోని నడిపించింది. దాంట్లో యూనిట్‌కి చెందిన ఇద్దరిని కూర్చోబెట్టుకుని సరదాగా ఆ పరిసరాల్లో కలియ తిరిగింది. దీంతో చిత్ర యూనిట్‌ మొత్తం షాక్‌కి గురయ్యారు. దీంతోపాటు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ స్టార్‌ కూతురు, క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తున జాన్వీ కపూర్‌ ఇలా చేయడం అంతా అవాక్కవుతున్నారు. మొత్తానికి కాసేపు తాను చిల్‌ అవుతూ, యూనిట్‌ని చిల్‌ చేసిందని చెప్పొచ్చు. ఈ వీడియోని జాన్వీ కపూర్‌ ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంది. `ఫిల్మ్ షూట్స్ సరదాగా ఉన్నాయి` అని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది. 

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్‌ `దఢక్‌` చిత్రంతో హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ తర్వాత `గుంజన్‌ సక్సేనాః ది కార్గిల్‌ గర్ల్`తో మెప్పించింది.  ప్రస్తుతం `రూహి అప్జానా`, `దోస్తానా 2` చిత్రాలతోపాటు `గుడ్‌లక్‌ జెర్రీ` చిత్రంలో నటిస్తుంది. దీనికి సిద్ధార్థ్‌ సేన్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. 

ఇదిలా ఉంటే జాన్వీ కపూర్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. గతంలో విజయ్‌ దేవరకొండ `లైగర్‌`లో నటించాల్సి ఉంది. కానీ సెట్‌ కాలేదు. ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌ ఎంట్రీకి సంబంధించిన న్యూస్ వినిపిస్తుంది. ఓ క్రియేటివ్‌ డైరెక్టర్‌ జాన్వీని లాంచ్‌ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి.