గత కొన్నేళ్లుగా కొంచెం బొద్దుగా ఉన్నతారక్ తన ఫిజిక్ ని నమ్మలేని విధంగా మేకోవర్ చేసుకోవడం చూస్తుంటే ఎన్టీఆర్ తన సినిమా మీద ఎంత డెడికేషన్ ఉందో అర్థమవుతోంది. ఇదిలావుంటే ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ లాక్ చేసుకున్నారు. పవన్ సినిమా ఎటూ పోయింది కాబట్టి దాని గురించి వివరణ ఇస్తూ కూర్చోవడం కంటే తారక్ స్క్రిప్ట్ ఎంత బెస్ట్ గా సిద్ధం చేసుకోగలం అనే దాని మీదే ఆయన దృష్టి పెట్టినట్టు తెలిసింది. యద్దనపూడి సులోచనారాణి షాడో మధుబాబు నవలలో ఒకరిది దీని కోసం అఫీషియల్ గా హక్కులు కొని తీస్తున్నారు అని చెప్పారు కాని దానికి క్లారిటీ లేదు.

ఇక ఇందులో విలన్ గా జగపతి బాబుని తీసుకోబోతున్నట్టు తాజా సమాచచారం. హీరో-విలన్ గా తారక్ జగ్గుల కాంబినేషన్ నాన్నకు ప్రేమతోలో సూపర్ గా సెట్ అయ్యింది. లెజెండ్ సినిమా మొదలుకుని జగపతి బాబు విలన్ గా తిరుగు లేని ఫాంలో ఉన్నాడు. ఇందులో వాటిని తలదన్నే రీతిలో త్రివిక్రమ్ జగ్గు పాత్రను సెట్ చేసినట్టు టాక్. అధికారిక ప్రకటన కానప్పటికీ దాదాపు ఖాయం అయ్యే సూచనలు ఉన్నాయట. ఒకవేళ అదే జరిగితే మరో ఆకర్షణ తోడైనట్టే. గ్లామర్ పరంగా పూజా హెగ్డే ఇప్పటికీ ప్లస్ కాగా తమన్ ఈసారి మ్యూజిక్ తో అదరగొడతాను అని ముందే హామీ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగి రాగానే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ ఐదు నెలల్లో ఫినిష్  చేసే టార్గెట్ లో ఉన్నాడట త్రివిక్రమ్. ఇది పూర్తయ్యాక రాజమౌళి మల్టీ స్టారర్ లో తారక్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అజ్ఞాతవాసి జ్ఞాపకాలు పూర్తిగా చెరిగిపోయాయి కాబట్టి త్రివిక్రమ్ చేయబోయే ఈ క్రేజీ మేజిక్ కోసం ఫాన్స్ అప్పుడే వెయిట్ చేయటం మొదలు పెడుతున్నారు.