నాగార్జున హిరోగా న‌టిస్తున్న  భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌ మ‌హేష్ రెడ్డి నిర్మాత‌గా రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం మొద‌టిసారిగా నాగార్జున మూవీలో విల‌న్ గా న‌టిస్తున్న జ‌గ‌ప‌తిబాబు


అయితే...ఈ మూవీలో జ‌గ‌ప‌తిబాబు ఓ రాజు పాత్ర పోషిస్తున్నారు. వెంక‌టేశ్వ‌ర‌స్వామి భ‌క్తురాలైన కృష్ణ‌మ్మ‌ను ప్రేమించే రాజుగా జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తున్నార‌ట‌. నాగార్జున న‌టించిన రావోయి చంద‌మామ‌లో జ‌గ‌ప‌తిబాబు న‌టించారు. మ‌ళ్లీ ఇప్పుడు నాగార్జున సినిమాలో జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తుండ‌డం విశేషం. జ‌గ‌ప‌తిబాబు భ‌క్తిర‌స చిత్రంలో రాజుగా న‌టించ‌డం ఇదే తొలిసారి.

 ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఫిబ్ర‌వ‌రి 10న ఓం న‌మో వేంకటేశాయ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.