సంక్రాంతికి ఇంటికి కొత్త అల్లుడు వస్తే ఆ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే జగ్గూభాయ్ కూడా తన అల్లుడు కార్తికేయకు హార్ట్ ఫుల్ గా వెల్కమ్ చెప్పారు. ఇటీవల జైపుర్ లో రాజమౌళి తనయుడు కార్తికేయకు అలాగే జగపతి బాబు సోదరుడి కుమార్తె పూజ ప్రసాద్ ల వివాహం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. 

ఇక పెళ్లి సంబరాల అనంతరం రీసెంట్ గా హైదరాబద్ లో అడుగుపెట్టిన కార్తికేయ తన ఇల్లాలితో కలిసి అత్తగారి ఆదిత్యాన్ని స్వీకరించారు. అందుకు సంబందించిన ఫోటోనుజగపతి బాబు సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నాడు. అల్లుడు గారు మా జీవితంలోకి రావడంతో మా కుటుంబం పరిపూర్ణమైంది అంటూ వెల్కమ్ అల్లుడు గారు అని జగ్గు భాయ్ ట్వీట్ చేశారు. 

ఇక వివాహ వేడుకలో ప్రముఖ టాలీవుడ్ తారలు ప్రభాస్ - జూనియర్ ఎన్టీఆర్ అక్కినేని హీరోలతో పాటు రామ్ చరణ్, నాని దంపతులు హాజరైన సంగతి తెలిసిందే.