రోడ్లపై నడకకు కారణం చెప్పేసిన జగపతిబాబు

jagapathi babu reveals the secret behind his walk for cause
Highlights

  • వైజాగ్, విజయవాడలో రోడ్లపై నడిచిన జగపతిబాబు
  • తెల్ల చొక్కా పంచె కట్టుకుని రోడ్డుపైకొస్తే రాజకీయాల్లోకొస్తాడని చర్చ
  • తాను సామాన్యుడిలా రోడ్డెక్కటానికి గల కారణం వెల్లడించిన జగపతిబాబు

 హీరో జగపతిబాబు పంచె కట్టులో చేసిన నడకకు కారణాలు ఏంటో చెప్పేశారు. వాక్ ఫర్ కాజ్ పేరుతో చిన్న సినిమాలను ఆదరించాలని, చిన్న సినిమాలకి థియేటర్స్ కేటాయించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో తాను నడక చేపట్టానన్నారు. ఐమ్యాక్స్ వద్ద గల లేక్ వ్యూ పార్క్‌ లో రచయిత మూవీ పోస్టర్‌ను జగపతిబాబు ఆవిష్కరించారు.

 

చిన్న సినిమాలను ఆదరించాలని, ఆదరణ లేక మంచి సినిమాలు చచ్చిపోతున్నాయని జగపతిబాబు చెప్పారు. చిన్న సినిమాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలనే కారణంతో తాను నడక కార్యక్రమం చేపట్టానని చెప్పారు. చిన్న సినిమాల్ని బతికిద్దామని, తాను చేస్తున్న నడకకు వైజాగ్, విజయవాడలో మంచి సపోర్ట్ వచ్చిందని చెప్పారు. కొత్త హీరో, కొత్త డైరెక్టర్లు, కొత్త వాళ్లు చేసిన సినిమా “రచయిత” అని జగపతిబాబు చెప్పారు.

 

రచయిత లాంటి సినిమాలను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నానన్నారు జగపతిబాబు. రచయిత సినిమా కథ నచ్చి బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్నానని, రచయిత టీమ్‌కు సపోర్ట్ చేస్తున్నానని జగపతి చెప్పారు. డేట్స్ కుదరక తాను ఈ సినిమా మిస్ అయ్యానన్న జగపతి, ఈ సినిమా హిట్ అవ్వాలనుకుంటున్నాని చెప్పారు. కథ నచ్చి అంబాసిడర్‌గా ఒప్పుకున్నట్లు తెలిపారు.

 

అంతేకాక రాజకీయాలకు తనకు సంబంధం లేదని జగపతిబాబు స్పష్టం చేశారు. వారం తరువాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి రచయిత సినిమా గురించి మరిన్ని వివరాలు చెప్తానని జగపతి చెప్పారు. నంది అవార్డుల ఎంపికపై మాట్లాడేందుకు జగపతిబాబు నిరాకరించారు.

loader