Asianet News TeluguAsianet News Telugu

ఆ నిర్మాత వారం రోజులు భోజనం కూడా తెప్పించలేదు.. జగపతిబాబు కామెంట్స్!

టాలీవుడ్ అగ్ర నిర్మాత కొడుకు అతడికేం కష్టాలు ఉంటాయిలే అనుకుంటే పొరపాటే.. అగ్ర నిర్మాత కొడుకైనా సినిమా ఇండస్ట్రీలో చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని, ఇండస్ట్రీ ఎన్నో పాఠాలు నేర్పిందని అంటున్నారు నటుడు జగపతిబాబు

jagapathi babu comments on tollywood director
Author
Hyderabad, First Published Aug 25, 2018, 3:08 PM IST

టాలీవుడ్ అగ్ర నిర్మాత కొడుకు అతడికేం కష్టాలు ఉంటాయిలే అనుకుంటే పొరపాటే.. అగ్ర నిర్మాత కొడుకైనా సినిమా ఇండస్ట్రీలో చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని, ఇండస్ట్రీ ఎన్నో పాఠాలు నేర్పిందని అంటున్నారు నటుడు జగపతిబాబు. హీరోగా కెరీర్ మొదలుపెట్టిన జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఓ నిర్మాత తనకు వారం రోజుల పాటు భోజనం తెప్పించలేదనే సంచలన కామెంట్స్ చేశారు. ''సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమా అవకాశాలు వస్తాయేమోనని ఫోన్లు పట్టుకొని తిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సినిమా ఛాన్స్ కి సంబంధించి ఫోన్ కాల్ వస్తే అదొక అద్భుతంగా అనిపించేది. అలాంటిది ఇప్పుడు నా చేతిలో 13 సినిమాలున్నాయి. మా నాన్న పెద్ద నిర్మాత.. నేను కాదు.

అందువలనే చిన్న నిర్మాత తన సినిమాలో వేషం వేయమని పిలిచినా.. నేను తప్పుగా భావించను. ఒక నిర్మాత అయితే షూటింగ్ లో నాకు కుర్చీ వేయలేదు. మరో నిర్మాత అయితే వారం రోజుల పటు నాకు భోజనం తెప్పించలేదు'' అంటూ ఇండస్ట్రీలో తను ఎదుర్కొన్న విషయాలను గుర్తు చేసుకున్నారు. ఇక డబ్బు విషయంలో తనను ఎవరైనా ఈజీగా మోసం చేసేయొచ్చని చెప్పాడు జగపతి బాబు. ఆ కారణంగానే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చారు.  

ఇది కూడా చదవండి.. 

జగ్గుభాయ్ బయోపిక్ కూడా రెడీ అవుతోంది!

Follow Us:
Download App:
  • android
  • ios