కృష్ణపట్నం ఆనందయ్య,ఆయన తయారు చేసిన మందు గత వారం రోజులు గా హాట్‌టాపిక్‌గా మారాయి. ఆ మందు కోసం ప్రజలు భారీగా తరలి రావటం, మందును ప్రభుత్వం నిలిపివేయడంతో రోగులు తిరిగి ఆసుపత్రులకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల అటెన్ష‌న్ మొత్తం నెల్లూరు కృష్ణపట్నం వైపై ఉంది. ఆనందయ్య కరోనా మందు కరోనాపై పనిచేస్తుందా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాకపోయినా.. జనం మాత్రం ఆ ముందును బాగా నమ్ముతున్నారు.  

ఆనందయ్య ఆయుర్వేద మందుతో కృష్ణపట్నం చుట్టుపక్కల ప్రజలు కరోనా నుంచి కోలుకున్నారని చెప్తున్నారు. దానివల్ల  ఎలాంటి ఇబ్బందులు లేవని పలువురు చెబుతున్నారు. కేవలం వనమూలికలను... అందరికీ చెప్పే ఇస్తున్నారు ఆనందయ్య. ఎలాంటి దాపరికాలు లేకుండా తను ఉపయోగించే మందుల గురించి కూడా చెబుతున్నారాయన. 

మనిషి ప్రాణాలు నిలబెడుతున్న ఈ మందుపై త్వరగా పరీక్షలు జరిపి... జనానికి అందుబాటులోకి తేవాల్సింది పోయి.. ఆయనను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వాదానికి జగపతిబాబు సైతం ఊతం ఇస్తున్నారు. తాజాగా ఆనంద‌య్య కరోనా మందుపై ఆయ‌న‌ త‌న అభిప్రాయాన్ని తెలిపారు. మాన‌వ‌జాతిని కాపాడాటానికి నేచ‌ర్ ముందుకు వ‌చ్చింద‌ని, ఆనంద‌య్య గారి మందు శాస్త్రీయంగా అనుమ‌తి పొందుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

‘మ‌న‌ల్ని కాపాడేందుకు నేచ‌ర్ ముందుకొచ్చిన‌ట్లు అనిపిస్తుంది. ఆనంద‌య్య గారి తెర‌ఫీ శాస్త్రీయంగా అనుమ‌తులు పొంది.. ప్ర‌పంచాన్ని
కాపాడుతుంద‌ని ఆశిస్తున్నాను. అత‌డిని దేవుడు ఆశీర్వ‌దించాలి’ అని జ‌గ‌ప‌తిబాబు ట్వీట్ చేశారు.