మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి 'సై రా నరసింహారెడ్డి' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తోన్న పలువురు గెటప్పులను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా జగపతి బాబు లుక్ ని విడుదల చేసింది.

ఈరోజు జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించి ఆయన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. సరికొత్త లుక్ తో జగపతి బాబు కనిపిస్తున్నారు. భుజాల వరకు జుట్టు, తెల్లబడిన గడ్డం, మీసాలతో కొత్తగా కనిపిస్తున్నారు. సినిమాలో జగపతిబాబు పాత్ర పేరు వీరారెడ్డి. మరి వీరారెడ్డిగా జగ్గుభాయ్ ఏ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇస్తారో చూడాలి!