ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తోంది. సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అమ్మేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ పై ఈ రేట్లు తగ్గింపు పడుతుందని అందరూ భయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల రేట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించి, నిర్ణయించిందన్న సంగతి తెలిసిందే. ఏ టికెట్‌ను ఏ ధరకు అమ్మాలో స్పష్టంగా చెబుతూ కొద్దీ రోజుల క్రితం నోటీసులు కూడా జారీ చేసింది. టాలీవుడ్ లోని సురేష్ బాబు వంటి కొంతమంది పెద్దలు ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు. బహిరంగానే తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తోంది. సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అమ్మేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ పై ఈ రేట్లు తగ్గింపు పడుతుందని అందరూ భయపడుతున్నారు. రీసెంట్ హిట్ అఖండ కు ఈ రూల్ లేకపోతే ఇంకా భారీ కలెక్షన్స్ వచ్చేవని చెప్తున్నారు.
ఈ నేపధ్యంలో ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా పెట్టిన ప్రెస్‌మీట్ లో ఈ టాపిక్ వచ్చింది. ఎన్టీఆర్ సన్నిహితులు ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నారని వాళ్ల హెల్ప్ ఏమైనా తీసుకుంటారా అని ప్రశ్నించగా దానికి సమాధానంగా సినిమా టికెట్ ధరల విషయంపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని డీవీవీ దానయ్య అన్నారు. త్వరలోనే ఈ అంశం కొలిక్కి వస్తుందన్న ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద సినిమాలకు వర్కౌట్ కాదన్నారు. ఇదే విషయం మీద జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ టిక్కెట్ ధరల పెంపు వెనక హాలీవుడ్ పెద్దలున్నారంటూ సంచలన కామెంట్స్ చేసి షాక్ ఇచ్చారు. ఇప్పుడీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన ఏమన్నారంటే...
Also read RRR Movie: నాపై చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ ఇంట్రెస్ట్ లేదు.. వైరల్ అవుతున్న అలియా భట్ కామెంట్స్
ప్రభుత్వం జోక్యం లేదు కాబట్టే తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదిగింది..
₹50 మద్యం సీసా ప్రభుత్వమే ₹500 కి అమ్మవచ్చా!
కానీ ఖరీదైన సినిమా టిక్కెట్లు మాత్రం చవకగానే అమ్మాలా?
ముమ్మాటికీ తెలుగు సినిమా స్థాయిని తగ్గించే #జగన్ రెడ్డి గారి ప్రయత్నం వెనుక హాలీవుడ్ పెద్దలున్నారా? ఏమో!
