నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3లో ప్రతి రోజు గొడవలమయంగా మారుతోంది. హౌస్ లో ప్రతి రోజు ఏదో ఒక విషయంలో ఇంటి సభ్యుల మధ్య చిచ్చురేగుతూనే ఉంది. ఐదవ ఎపిసోడ్ లో శ్రీముఖి వంట సరుకుల విషయంలో గొడవేసుకుంది. చపాతీ తినేశారంటూ పునర్నవి సీరియస్ అయింది. ఇక వరుణ్ సందేశ్ - వితిక జంట, మహేష్ విట్టా మధ్య జరిగిన మతాల యుద్ధం అయితే హౌస్ లో పరిస్థితులని ఒక్కసారిగా మార్చేసింది. 

నా భార్యకు మర్యాద ఇచ్చి మాట్లాడు అంటూ మహేష్ పై వరుణ్ సందేశ్ విరుచుకుపడ్డాడు. ఇదంతా ఐదవ ఎపిసోడ్ లో. శుక్రవారం జరగబోయే 6వ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదలచేశారు. ఈ ప్రోమోని బట్టి చూస్తే హౌస్ లో జోగిడి దోస్తులుగా ఉన్న ఇద్దరి మధ్య చిచ్చు మొదలైనట్లు తెలుస్తోంది. 

బాబా భాస్కర్, జాఫర్ ఇద్దరూ ఇప్పటివరకు చాలా స్నేహంగా మెలిగారు. కానీ మర్యాద ఇచ్చిపుచ్చుకునే విషయంలో జాఫర్ సీరియస్ అయినట్లు ప్రోమోలో చూపించారు. టాస్క్ లో భాగంగా వీరిద్దరూ అలా చేశారా లేక నిజంగానే జాఫర్, భాస్కర్ మధ్య గొడవ జరిగిందా అనేది తెలియాలంటే శుక్రవారం జరిగే ఎపిసోడ్ చూడాలి.