గత ఏడాది వరుణ్ ధావన్ తో నటించిన జుడ్వా 2తో మంచి సక్సెస్ అందుకున్న హీరొయిన్ జాక్వలిన్ ఫెర్నాండెజ్ . నిన్న శ్రీదేవి పార్ధీవ దేహానికి నివాళి అర్పించడానికి వచ్చిన తను సందర్భం మర్చిపోయి చాలా క్యాజువల్ గా నవ్వుతూ  మీడియా కళ్లకు చిక్కింది. ఎక్కడికి వచ్చాం అన్న స్పృహ కూడా లేకుండా తను ప్రవర్తించిన తీరు కో యాక్టర్స్ కు సైతం ఆశ్చర్యం కలిగించింది. నివాళి అర్పించడం కోసం సెలబ్రేషన్ క్లబ్ కు అందరితో పాటే వచ్చిన జాక్వెలిన్ ఏమి పట్టనట్టు ఏదో ఫంక్షన్ కు వచ్చినట్టు ఉండటం ఎవరి దృష్టిని దాటిపోలేదు వచ్చిన ప్రతి ఒక్కరు  కన్నీళ్ళు ఆపుకుని శ్రీదేవి దర్శనం కోసం వస్తుంటే ఈ సుందరి మాత్రం ఇలా చేయటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఓ అప్ కమింగ్ హీరొయిన్ ఇలా ప్రవర్తించడం పట్ల సోషల్ మీడియాలో భారీగా కామెంట్స్ పడుతున్నాయి. అయినా తెల్ల చీర కట్టుకొచ్చినంత మాత్రాన సరిపోదు కదా అలాంటి మనసు ఉన్నప్పుడే తప్పేదో ఒప్పేదో తెలుస్తుంది.