శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాలీవుడ్ చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సల్మాన్ ఖాన్ కిక్, హౌస్ ఫుల్ 2 చిత్రాలతో పాపులారిటీ సొతం చేసుకుంది.

శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాలీవుడ్ చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సల్మాన్ ఖాన్ కిక్, హౌస్ ఫుల్ 2 చిత్రాలతో పాపులారిటీ సొతం చేసుకుంది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తరచుగా వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. తన గ్లామర్ తో జాక్వెలిన్ బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఆమె చుట్టూ వివాదాలు కూడా ఉన్నాయి. 

ఇదిలా ఉండగా జాక్వెలిన్ తాజాగా లగ్జరీ హౌస్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ముంబైలో అత్యంత విలాసవంతమైన ప్రాంతం బాంద్రాలోని పాలి హిల్ లో జాక్వెలిన్ కొత్త ఇల్లు కొన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో అతి తక్కువ ధరకి ఇల్లు కొనాలన్నా కనీసం 12 కోట్లు అవుతుంది. జాక్వెలిన్ దాదాపు రూ20 కోట్ల ఖర్చుతో ఫ్లాట్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో జాక్వెలిన్ లగ్జరీ ఫ్లాట్ ని ఇష్టపడి కొనిందట. అక్కడ ఫ్లాట్స్ 1119 స్క్వేర్ ఫీట్స్ నుంచి 2557 స్క్వేర్ ఫీట్స్ వరకు ఫ్లాట్స్ అందుబాటులో ఉంటాయి. 3బిహెచ్ కె, 4 బిహెచ్ కె అందుబాటులో ఉంటాయి. జాక్వెలిన్ ఏ తరహా ఫ్లాట్ కొనిందో తెలియదు కానీ మంచి లగ్జరీ హౌస్ నే సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇంటి దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. 

జాక్వెలిన్ లగ్జరీ హౌస్ కొన్నట్లు వార్తలు రాగానే నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. సుఖేష్ గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడని నెటిజన్లు జాక్వెలిన్ పై సెటైర్లు వేస్తున్నారు. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ కు సంబంధాలు ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో జాక్వెలిన్ ఈడీ ముందు పలుమార్లు విచారణకు కూడా హాజరైంది. సుఖేష్, జాక్వెలిన్ మధ్య పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. సుఖేష్.. జాక్వెలిన్ కి ఖరీదైన కారులు, వస్తువులు గిఫ్ట్ గా ఇచ్చినట్లు విచారణలో ఈడీ అధికారులు గుర్తించారు. 

View post on Instagram

సుఖేష్ తో జాక్వెలిన్ సన్నిహితంగా ఉంటూ.. ముద్దు ముచ్చట్లు చేస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీనితో జాక్వెలిన్ పై ఇంకా అనుమానాలు బలపడ్డాయి. కానీ జాక్వెలిన్ మాత్రం అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. ఈ విషయంలో తన గురించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వైరల్ చేయొద్దని కూడా జాక్వెలిన్ అభిమానులని రిక్వస్ట్ చేసింది.