మనీలాండరింగ్‌ కేసులో ఇరుక్కుంది  బాలీవుడ్‌ బ్యూటీ  జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌. ఈ కేసులో విచారణలకు హాజరవుతుంది. ఈక్రమంలో  బుధవారం పటియాల హౌస్‌ కోర్టుకు వెళ్ళింది స్టార్ హీరోయిన్. 

గ్యాంగ్‌స్టర్‌ సుకేశ్‌ చంద్రశేఖర్‌కు సంబంధించి 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో కోర్టు విచారణకు హాజరయ్యింది బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్. మనీలాండరింగ్‌ కేసులో బుధవారం పటియాల హౌస్‌ కోర్టుకు హాజరైంది. గ్యాంగ్‌స్టర్‌ సుకేశ్‌ చంద్రశేఖర్‌కు సంబంధించి కేసులో కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో కోర్టు దగ్గర హడావిడి చేసింది జాక్వెలిన్. ఇక ఈ కేసులో గురువారం అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కోర్టుకు తెలిపింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థను కోర్టు ఆదేశించింది. ఈ విషయంపై ఈ నెల 18న మరోసారి విచారణ జరుగనున్నది.

Scroll to load tweet…

200కోట్ల మోసం చేసిన కేసులో నిందితుడుగా ఉన్నాడు బిజినెస్ మెన్ సుకేశ్ చంద్రశేఖర్‌. ఆయనతో జాక్వెలిన్ కు ఉన్న సంబంధాల నేపథ్యంలో.. ఆమెపై ఈ కేసు నమోదైంది. ఇక ఈ విషయంలో ఈడీ ఇప్పటికే చాలా సార్లు జాక్వెలిన్ ను విచారించింది, ప్రశ్నించింది. అంతే కాదు సుకేష్ నుంచి ఈ హీరోయిన్ కు చాలా సార్లు విలువైనర బహుమతులు అందినట్టు ఈడీ గుర్తించింది. అంతే కాదు వీరిద్దరు కలిసి బాగా క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఈ కేసులో ఆమె పాత్రపై పలు ఆరోపణలు, సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. 

అయితే ఇప్పటి వరకూ తనపై వచ్చిన ఆరోపణలను జాక్వెలిన్‌ ఖండించింది కాని ఒప్పుకోలేదు. ఈ కేసులో తనను కావాలని ఇరికించారని అంటోంది. అంతే కాదు తనలైఫ్ ను నాశనం చేయాలని చూస్తున్నారంటూ ఆరోపణలు చేస్తోంది జాక్వెలిన్. సుకేశ్ హోంశాఖలో అధికారిగా పరిచయం చేసుకుని.. తనను తప్పుదారి పట్టించాడని తెలిపింది. జైలులో ఉండి కూడా తనతో ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడే వాడని, కానీ జైల్లో విషయాన్ని మాత్రం తనకు తెలియనివ్వలేదని వెల్లడించింది. ఈ కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని అంటోంది బాలీవుడ్ వ్యూటీ. 

ఇక ఈ కేసులో మరికొందరు బాలీవుడ్ స్టార్స్ కూడా ఇరుక్కుని ఉన్నారు... మరో బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి పేరు కూడా ఈ కేసులో ప్రముఖంగా వినిపించింది. ఇక జాక్వెలిన్‌ సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్ గా అక్షకుమార్‌, ఇమ్రాన్‌ హష్మీ లతో కలిసి సెల్ఫీ సినిమాలో నటించింది బ్యూటీ. ఈమూవీలో దీవానే స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. ఇక ప్రస్తుతం ఫతే మూవీలో నటిస్తోంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చిత్రంలో నటిస్తున్నది.