రాఖీ పండుకు సందర్భంగా సెలబ్రిటీలు కూడా తమ తోబుట్టులతో తమ అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ యువ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ పోస్ట్ చేసిన ఓ మెసేజ్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం కరోనా సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యువ నటుడు జాకీ తన వంతు సహాకార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటికే కరోనా పరిస్థితులకు ప్రజలు అలవాటు పడటంతో పండుగలు కూడా జరపుకునేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జాకీ కూడా తన సోదరి దీప్‌షికా దేశ్‌ముఖతో తన అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన ఇంట్లో జరిగిన రాఖీ వేడుకలకు సంబందించిన ఫోటోలను షేర్ చేసిన జాకీ. `హ్యాపీ రక్షా బంధన్ దీప్షికా దేశ్‌ముఖ్. నువ్వు కేవలం నాకు అక్కవు మాత్రమే కాదు. నాకు అమ్మ, ఫ్రెండ్‌, సపోర్ట్‌, రక్షణ  ఇంకా చాలా చాలా. నువ్వు లేకుండా నేను ఏం చేయగలను. చంద్రుడు ఎంత దూరమో నేను నిన్ను అంతా ప్రేమిస్తున్నా` అంటూ కామెంట్ చేశాడు జాకీ.

ప్రస్తుతం జాకీ సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఫ్రంట్‌ లైన్ వారియర్స్‌ కోసం పీపీఈ కిట్‌లు ఇవ్వటం, బాలీవుడ్ డ్యాన్సర్స్‌కు ఆర్థికంగా సాయం చేయటం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. అంతేకాదు తన సొంత మ్యూజిక్ బ్రాండ్‌ లేబుల్‌ ముస్కురాయే ఇండియా ద్వార కూడా భారీగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడడు జాకీ.