‘జబర్దస్త్‌’లో నవ్వులు పూయించి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రామ్ ప్రసాద్ ఇప్పుడు సినిమాల వైపు సీరియస్ గా ప్రయాణం పెట్టుకున్నారు. ఆయన హీరోగా పీప్ షో అనే సినిమా మొదలైంది. ఆ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.  

ఆటోపంచ్‌లతో జలక్కులిచ్చే కామెడీ తో, కొత్త కాన్సెప్ట్‌లతో ఒత్తిడిని తగ్గించే ఫన్ తో . టైమింగ్‌తోపాటు రైమింగ్‌ కూడా ఉన్న కామెడీ ఖిలాడీ రామ్‌ ప్రసాద్‌. ‘జబర్దస్త్‌’లో నవ్వులు పూయించి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రామ్ ప్రసాద్ ఇప్పుడు సినిమాల వైపు సీరియస్ గా ప్రయాణం పెట్టుకున్నారు. ఆయన హీరోగా పీప్ షో అనే సినిమా మొదలైంది. ఆ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఆ లుక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

వివరాల్లోకి వెళితే.. రామ్ ప్రసాద్ 'పీప్ షో' సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఆయన సరసన హాట్ బ్యూటీ నేహా దేశ్ పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. క్రాంతి కుమార్ సీహెచ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఎస్ఆర్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దిలీప్ బండారి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ చేస్తూనే తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసి జనం దృష్టిని తమ సినిమాపై పడేలా చేసుకున్నారు నిర్మాతలు.

ఈ పోస్టర్‌‌ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న రామ్ ప్రసాద్.. ''నో బీప్స్, ఆసక్తికరమైన కథతో త్వరలో మీ ముందుకొస్తున్నాం'' అని పేర్కొన్నారు. ఇందులో హీరోయిన్ నేహా దేశ్ పాండే నగ్నంగా ఉండి జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఫొటోను తన అందాలకు అడ్డుగా పెట్టుకొని కనిపిస్తుండటం యూత్ ఆడియన్స్‌కి కిక్కిచ్చింది. దీంతో ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అయింది. చూస్తుంటే ఈ 'పీప్ షో' సినిమా ద్వారా కుర్రకారుకు రొమాంటిక్ ట్రీట్ బాగానే ఇవ్వనున్నట్లు అర్దమవుతోంది.