ఎలా బతకాలో తెలియని అయోమయ స్థితిలో ఆయనను దేవుడే పంపాడు : జబర్దస్త్ వేణు

First Published 24, Feb 2018, 10:43 AM IST
Jabardasth Venu On about his Tollywood Entry
Highlights
  • జబర్దస్త్ తో పాపులర్ అయిన కమెడియన్ వేణు
  • అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం అంత సులువు కాదు​

 జబర్దస్త్ తో పాపులర్ అయిన కమెడియన్ వేణు కూడా... నానా కష్టాలు పడి ఈ స్థాయికి చెప్పాడు. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు తన కెరీర్ బిగిన్ కాక ముందు జరిగిన అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.సినిమా అనేది ఓ రంగుల కల అని దానిని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో చాలామంది సినీ రంగంలోకి అడుగుపెడుతుంటారని వేణు చెప్పాడు. తనకు తెలిసిన ఓ సినీ జర్నలిస్ట్ దయ వల్లే తాను ఈ రోజు నటుడినయ్యానని చెప్పాడు. 


అయితే అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం అంత సులువు కాదు అన్న విషయాన్ని తెలుసుకున్నానని అన్నాడు. సినిమాల్లోకి రాకముందు తాను కృష్ణానగర్లో  'చిత్రం' శీను దగ్గర అసిస్టెంట్ గా ఉన్నానని చెప్పాడు. అనుకోకుండా అక్కడి నుంచి బయటికి రావాల్సి వచ్చిందని - అయితే - ఆ తర్వాత ఎలా బతకాలో తెలియని అయోమయ స్థితిలో పడ్డానని అన్నాడు. అయితే  నటుడిని కావాలనే బలమైన కోరిక మనసులో ఉందన్నాడు. అప్పట్లో  తన పక్క రూమ్ లో ఉండే  సినీ జర్నలిస్ట్  కొత్తపల్లి శేషు తన పరిస్థితి చూసి 'జై' సినిమా ఆడిషన్స్ కు తన ఫొటోలు పంపించారని తెలిపాడు.  ఆ ఆడిషన్స్ కు వెళ్లేందుకు కూడా ఆయన సహకరించారని చెప్పాడు. ఆ సినిమాలో చాన్స్ వచ్చిందని షూటింగ్ కు వెళ్లేందుకు శేషు గారు 5 జతల బట్టలు కొనిపెట్టారని గుర్తు చేసుకున్నాడు. నా కోసం ఆయనని దేవుడే పంపించాడని నమ్ముతానని ఆయన వల్లే ఈ రోజు తాను ఆర్టిస్ట్ కాగలిగానని చెప్పాడు. 

loader