తనజీవితంలో  కష్టసుఖాల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు జబర్థస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్. నాగబాబును దేవుడితో పోల్చిన అతను.. తనకు కష్టకాలంలో చేయూతనందించినవారి గురించి కూడా వివరించాడు.  

జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్స్ లో పంచ్ ప్రసాద్ ఒకరు. వరుసగా పంచ్ లు విసురుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఈ హాస్యనటుడి జీవితో ఎన్నో విషాదాలు అలుముకుని ఉన్నాయి. అయినా వాటిని లెక్క చేయకుండా జీవితాన్ని నడిపిస్తున్నాడు ప్రసాద్. అయితే కొంతకాలంగా ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ట్రీట్మెంట్ కు ఎక్కువగా ఖర్చు అవుతుండటంతో,ఆర్ధిక పరమైన ఇబ్బందులతోను సతమతమవుతున్నాడు.ఇకతాను ఎదుర్కొంటున్న కష్టాల గురించి.. తనకు సాయం చేసిన వ్యాక్తుల గురించి తాజా ఇంటర్వ్యూలో పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ..వారి గురించి ప్రస్తావించాడు. 

ఇక ప్రసాద్ మాట్లూడుతూ.. తాను జీవితంల చాలా కష్టాలు ఎదుర్కొన్నాను అన్నారు. చిన్నతనం నుంచే తాను మాటకు మాట ఇలా పంచ్ వేయడం అలవాటు అని చెప్పనిన ప్రసాద్.. మాది భీమవరం .. నా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు ఆదుఖం నుంచి బయట పడకముందే.. తరువాత అక్క చనిపోయింది దాంతో మా కుటుంబ కోలుకోకుండా అయ్యింది అన్నారు. ఇక మా అమ్మకు నేనే ఆధారం. అందువలన 10వ తరగతితో చదువు మానేసి హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ ఒక మెస్ లో సప్లైయర్ గా పనిచేస్తూ జీవితాన్ని లాగించాను అన్నారు ప్రసాద్ 

అంతే కాదు తనకు షకలక శంకర్ అవకాశం ఇవ్వడం వల్లే ఈ మాత్రం పేరు సంపాధించాను అన్నారు ప్రసాద్. అంతే కాదు జబర్థస్త్ తనకు మంచి గుర్తింపు ఇచ్చిందని.. నేను జీవితంతో మర్చిపోలేని మధురానుభూతులు జబర్ధస్త్ ద్వారా పొందాను అన్నారు పంచ్ ప్రసాద్. ఇక తనకు నాగబాబు దేవుడితో సమానం అన్నారు పంచ్ ప్రసాద్. ఆయన చేసిన సాయానికి జీవితాంతం రుణపడి ఉండాలి. అందుకే ఆయన ఫోటో నా ఇంట్లో పెట్టుకున్నాను అన్నారు ప్రసాద్. 


"నేను అనారోగ్యం బారిన పడగానే ఆర్పీ స్పందించాడు. ఇప్పటికీ నాకు తన సహాయ సహకారాలు అందిస్తూనే వస్తున్నాడు. ఇక నా పరిస్థితి తెలియగానే నాగబాబుగారు వెంటనే ఆదుకున్నారు. ఆయన నా దేవుడు .. ఇక నూకరాజు ఎప్పుడూ నాతోనే ఉంటూ.. నన్ను అన్నలా చూసుకుంటున్నాడు. జబర్థస్త్ నుంచి ప్రతీ ఒక్కరూ.. హెల్ప్ చేస్తూనే ఉన్నారు" అంటూ చెప్పుకొచ్చాడు.