హైపర్ ఆది అంటే తెలియని తెలుగువాడు లేడు అన్నట్లుగా అతి కొద్దికాలంలోనే ఎదిగాడు. జబర్దస్త్ లో తనదైన పంచ్ లతో అతి కొద్ది సమయంలోనే అఖండ ప్రేక్షకాదరణ సంపాదించాడు. సినిమాల్లో వేషాలు సైతం సంపాదిస్తూ బిజీ అవుతున్నాడు. మంచి సంపాదనలో పడ్డాడు. ఈ టైమ్ లో ఏ తల్లి,తండ్రి అయినా ఏమి ఆలోచిస్తాడు. పెళ్లి చేసి ఓ ఇంటివాడిని చేయాలని ప్లాన్ చేస్తారు. ఆది విషయంలోనూ అది జరగనుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఈ విషయం ఖరారు చేసి మరీ తెలియచేసాడు ఆది. సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకున్నాక పెళ్లి చేసుకుంటానని సరదాగా అన్నా,తనకు దాదాపు వివాహం నిశ్చమైందనే విషయం రివీల్ చేసాడు. 
 
వృత్తి పరంగా అయినా ఆ మ‌ధ్య అన‌సూయ‌తో చ‌నువుగా ఉంటున్నాడ‌ని , ఇటీవ‌ల యాంకర్ వర్షిణితో ఎఫైర్ న‌డుపుతున్నాడ‌ని రూమర్స్ వచ్చాయి. వాటిని ఖండించేందుకు గానూ  త‌న వివాహ విషయాలు రివీల్ చేసాడు. తను ఎప్పుడు పెళ్లి చేసుకోబోయేది, వ‌ధువు ఎవ‌ర‌నే విష‌యాన్ని చెప్పి అంద‌రికీ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు హైప‌ర్ ఆది.

ఈ విషయమై ఆది మాట్లాడుతూ...త‌మ త‌ల్లితండ్రులు ఒక అమ్మాయిని వెతికార‌ని, ఆమెది తమ సొంత జిల్లా ప్ర‌కాశం అని చెప్పుకొచ్చాడు ఆది. అలాగే వచ్చే ఏడాది త‌మ‌ పెళ్లి ఉంటుంద‌నే విష‌యం కూడా చెప్పి , త‌న ఫ్యాన్స్‌కి క్లారిటీఅందించాడు.  టీవీల్లో వచ్చిన పాపులారిటీతో వెండితెర‌పై కూడా అడ‌పాద‌డ‌పా కనిపిస్తున్నాడు హైప‌ర్ ఆది. రీసెంట్ గా బాబీ దర్శకత్వంలో  వ‌చ్చిన వెంకీ మామ చిత్రంలో నాగ చైత‌న్య స్నేహితుడి పాత్ర‌లో క‌నిపించి మంచి ఫన్ అందించాడు.