బిగ్ బాస్ హౌస్ నుండి అవినాష్ ఎలిమినేట్ కావడం నిజంగా మిరాకిల్ అని చెప్పాలి. అనేక సమస్యలతో, ఆర్ధిక ఇబ్బందులతో హౌస్ లోకి ఎంటరైన అవినాష్ ప్రతి నిమిషం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించాడు. ఎలాగైనా టైటిల్ గెలవాలనే కసితో షోకి వచ్చిన అవినాష్ ప్రతి నిమిషం దాని కోసం ప్రయత్నించే వాడు. బిగ్ బాస్ టాస్క్ లలో వంద శాతం ఎఫ్ఫార్ట్స్ పెడుతూనే, తన మార్కు కామెడీతో ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించేవాడు. 

కామెడీ చేయడానికి ఆస్కారం ఉన్న ప్రతి సందర్భాన్ని అవినాష్ ఉపయోగించుకొని ఇంటి సభ్యుల ముఖాలపై నవ్వులు చిందించే వాడు. అప్పుడప్పుడు సహనం కోల్పోయినా, ఎక్కువ సమయం కామెడీ చేసి నవ్వించడానికి అవినాష్ ప్రయత్నం చేసేవారు. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ జర్నీ ముగిసింది. ఈ వారానికి గాను అవినాష్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. ఎలిమినేషన్స్ లో చివరి వరకు ఉన్న మోనాల్, అవినాష్ లలో మోనాల్ సేవ్ కావడంతో అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. 

టైటిల్ ఫేవరేట్ అనుకున్న అవినాష్ ఎలిమినేట్ కావడం నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమే. ఎలిమినేటైన తరువాత కూడా అవినాష్ తన మార్కు కామెడీ కొనసాగించారు. బిగ్ బాస్ వేదికపై ఇంటిలో ఉన్న ఆరుగురు సభ్యులను ఇమిటేట్ చేసి, ప్రేక్షకులను, ఇంటి సభ్యులను కడుపుబ్బా నవ్వించాడు. ఒక రియల్ ఎంటర్టైనర్ ని బిగ్ బాస్ షో కోల్పోయింది అనడంలో సందేహం లేదు.