జబర్దస్త్ కు చేరిన చిరు పవన్ ల పంచాయితీ నాగబాబును నిలదీసిన సుడిగాలి సుధీర్ జబర్దస్త్ దసరా మహోత్సవం షోలో రోజా కన్నీళ్లు
బుల్లితెరపై ఈటీవీలో 'జబర్దస్త్', 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' కామెడీ షోలు తెలుగు టీవీ ప్రేక్షకుల్లో ఎంత ఆదరణ పొందాయో తెలిసిందే. నాగబాబు, రోజా న్యాయ నిర్ణేతలుగా, అనసూయ, రష్మి లాంటి హాట్ బ్యూటీస్ యాంకరింగ్ చేస్తున్న ఈ షోలు.. తెలుగు టీవీ వినోద కార్యక్రమాల్లోనే కొన్నేళ్లుగా తిరుగులేని ఆధిపత్యం సాగిస్తున్నాయి. ఇక ఈ దసరా సందర్భంగా 'జబర్దస్త్' షోను ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. 'దసరా మహోత్సవం' పేరుతో గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించబోతున్నారు.
సెప్టెంబర్ 30న ప్రసారం అయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ ప్రోమో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి-పవన్ కళ్యాణ్ ల గురించి సుడిగాలి సుధీర్ నాగబాబును ప్రశ్నించడం పెద్ద చర్చనీయాంశమైంది. సుధీర్ మాటలతో హర్ట్ అయిన నాగబాబు ఫైల్ టేబుల్ పై సీరియస్ గా విసిరేసి చాలా కోపపంగా అర్థంతరంగా షో నుండి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.
ఈ ప్రోమోలో జబర్దస్త్ కమెడియన్లు వాదులాడుకోవడం, తీవ్రంగా పరుషాలు మాట్లాడటం లాంటివి కనిపించాయి. ఇక నాగబాబు మాట్లాడుతూ.. బ్రిటిష్ వాడు కోహినూర్ వజ్రం ఎత్తుకెళ్లింది అని చెప్పింది ఎవరు? ఇదిగో ఇక్కడ ఉంది కోహినూర్ డైమండ్ అంటూ రోజాను ఉద్దేశించి కమెంట్ చేయడం, రోజా సిగ్గుపడటం కనిపించింది.
ఇక రోజాను కూడా.. ఆ పార్టీ ఈ పార్టీ మార్చడం కాదు, ఏదో ఒక పార్టీలో ఉండాలంటూ కొందరు కమెడియన్లు విమర్శించారు. దాంతో రోజా ఎమోషన్ అయ్యి ఏడ్చేసింది. తాను ఎమ్మెల్యే అయ్యానంటే దానికి కారణం జబర్దస్త్ షో మాత్రమే అని స్పష్టం చేసింది.
షో మధ్యలో అనసూయ కళ్లు తిరిగి పడిపోవడం, నాగబాబు, ఇతరలంతా కలిసి ఆమెను పట్టుకోవడం కనిపించాయి. మొత్తానికి దసరా మహోత్సవం చాలా రసవత్తరంగా సాగుతుందని స్పష్టమవుతోంది. సెప్టెంబర్ 30న తొమ్మిది గంటలకు ప్రసారం కాబోతున్న జబర్దస్త్ దసరా మహోత్సవం ప్రేక్షకులకు జబర్దస్త్ వినోదం పంచనుంది.

