`జబర్దస్త్` కామెడీ షో చాలా మందికి లైఫ్‌ ఇస్తుంది. దీని ద్వారా హీరోలుగానూ రాణిస్తున్నారు. మరికొంతమంది సినిమాల్లో కమెడీయన్లుగా సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆది, అదిరే అభి హీరోగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో గెటప్‌ శ్రీను కూడా ఉన్నారు. సుడిగాలి సుధీర్‌, రామ్‌ప్రసాద్‌, గెటప్‌ శ్రీను కలిసి `త్రీమంకీస్‌` చిత్రంలో నటించారు. ఆ తర్వాత `జాంబీరెడ్డి`లోనూ గెటప్‌ శ్రీను కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు సోలో హీరోగా `రాజుయాదవ్‌` సినిమా చేస్తున్నారు. 

గతేడాది ప్రారంభమైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని శనివారం విడుదల చేశారు. ఇందులో ఓ అమ్మాయి వయ్యారంగా నడుచుకుంటూ కాలేజ్‌కి వెళ్తుంది. లుంగీ కట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చిన గెటప్‌ శ్రీను `స్వీటీ..  `అంటూ పిలుస్తాడు. దీంతో వయ్యారంగా వెనక్కి తిరిగి చూస్తుంది ఆ అమ్మాయి. ఈ ఫస్ట్ గ్లింప్స్ గా తాజాగా ఆకట్టుకుంటోంది. ఇందులో శ్రీను సరసన అంకిత ఖరత్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. వేణు ఉడుగుల వద్ద పనిచేసిన కృష్ణమాచారి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. హర్షవర్థన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నారు. సాయి వరునవి క్రియేషన్స్ పతాకంపై ప్రశాంత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఓ కొత్త జోనర్‌లో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. 

గెటప్‌ శ్రీను `జబర్దస్త్`తో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. సుడిగాలి సుధీర్‌ టీమ్‌లో రామ్‌ప్రసాద్‌తో కలిసి ఆయన పంచిన కామెడీకి మంచి పేరుంది. అంతేకాదు విభిన్నమైన గెటప్స్ లో మెప్పిస్తూ అలరించడం, నవ్వించడం గెటప్‌ శ్రీను స్పెషాలిటీ. అందుకే ఆయనకు గెటప్‌ శ్రీను అనే పేరు పెట్టారు. శ్రీను నటనని, కామెడీని నాగబాబు చాలా సార్లు ప్రశంసించారు.