Asianet News TeluguAsianet News Telugu

'జాతి రత్నాలు' 25 డేస్ కలెక్షన్స్,ఎంత పెడితే ఎంతొచ్చింది

మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదలైన జాతి రత్నాలు తొలిరోజు నుంచే సంచలన వసూళ్లు సాధించటం మొదలెట్టింది.  మూడు రోజుల్లోనే 11 కోట్ల టార్గెట్ ఫినిష్ చేసుకుని జైత్ర యాత్ర చేసింది.

Jaathi Ratnalu movie 25 days collections jsp
Author
Hyderabad, First Published Apr 6, 2021, 10:19 AM IST

న‌వీన్ పోలిశెట్టి, ఫ‌రియా అబ్దుల్లా జంటగా దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన చిత్రం జాతి రత్నాలు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి   కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని  స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌‌పై మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదలైన జాతి రత్నాలు తొలిరోజు నుంచే సంచలన వసూళ్లు సాధించటం మొదలెట్టింది.  మూడు రోజుల్లోనే 11 కోట్ల టార్గెట్ ఫినిష్ చేసుకుని జైత్ర యాత్ర చేసింది.

ఇక ఈ చిత్రం రిలీజ్ కు ముందు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తన టీం మెంబెర్స్ తో కలిసి కాలేజెస్, ప్రీ రిలీజ్ టూర్ అంటూ హీరోయిన్ ఫారియా తో కలిసి స్టేజ్ మీద డాన్స్ చేస్తూ హంగామా చేసి క్రేజ్ తెచ్చారు. ఆ తర్వా.... జాతి రత్నాలు సినిమాని మహాశివరాత్రి రోజున థియేటర్స్ లోకి తీసుకువచ్చాక టీవిల్లో పబ్లిసిటీ కుమ్మేసారు. సినిమా అనుకున్నదానికన్నా మంచి హిట్ అవటంతో డైరక్టర్ ఇంటర్వూలు, హీరో తన టీమ్ తో ఫారిన్ టూర్స్ తో హంగామా క్రియేట్ చేసారు. ఇవన్ని సినిమాని హిట్ తీరానికి నడిపించాయి. 

మరో ప్రక్క నిర్మాత ఓటీటి రిలీజ్ ఆఫర్స్ లెక్క చెయ్యకుండా థియేటర్స్ లో విడుదల చేయాలనే నిర్ణయం కలిసొచ్చింది. రెండు వారాలపాటు కలెక్షన్స్ వేటలో జాతి రత్నాలు అదరగొట్టేసింది. మూడో వారానికి డల్ అయ్యినా వీకెండ్స్ లో స్టడీగానే ఉంది. ఈ నేపధ్యంలో 25 రోజులు అంటే మూడు వారాలు పూర్తి చేసుకున్న జాతి రత్నాలు  ఈ చిత్రం  ఏరియా వైజ్ కలెక్షన్స్..షేర్  ఇప్పుడు చూద్దాం..

 నైజాం: 15.96 కోట్లు
సీడెడ్:  4.26 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.95 కోట్లు
ఈస్ట్:  1.92 కోట్లు
వెస్ట్:  1.52 కోట్లు
గుంటూరు: 2.08 కోట్లు
కృష్ణా:  1.84 కోట్లు
నెల్లూరు:  0.91 కోట్లు

ఏపీ + తెలంగాణ 25 రోజుల మొత్తం:  32.45 కోట్లు (54 కోట్ల గ్రాస్)
రెస్ట్ ఆఫ్ ఇండియా:  1.71 కోట్లు
ఓవర్సీస్:  4.25 కోట్లు

వరల్డ్ వైడ్ 25 డేస్ టోటల్: 38.76 కోట్లు షేర్ (68 కోట్ల గ్రాస్)

Follow Us:
Download App:
  • android
  • ios