`లైఫ్ ఆఫ్ రామ్`.. `జాను` సినిమాలోని తొలి పాట. ఓ ప్రొఫేషనల్ ఫోటోగ్రాఫర్ జీవితాన్ని ఆవిష్కరించే పాట. ఆద్యంతం వినసొంపుగా, మనసుని ఉల్లాసపరిచేలా ఉన్నా ఈపాట శ్రోతలను మెప్పించింది.
`లైఫ్ ఆఫ్ రామ్`.. `జాను` సినిమాలోని తొలి పాట. ఓ ప్రొఫేషనల్ ఫోటోగ్రాఫర్ జీవితాన్ని ఆవిష్కరించే పాట. ఆద్యంతం వినసొంపుగా, మనసుని ఉల్లాసపరిచేలా ఉన్నా ఈపాట శ్రోతలను మెప్పించింది. సమంత, శర్వానంద్ జంటగా, సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన `జాను` చిత్రంలోని ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ శ్రోతలని అలరిస్తుంది. తాజాగా ఈ వీడియో సాంగ్ అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుంది. వంద మిలియన్స్ వ్యూస్‌కి చేరుకున్న పాటగా నిలిచింది. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ పాట తాజాగా వంద మిలియన్స్ ని దాటేసింది. వంద మిలియన్స్ వ్యూస్ క్లబ్‌లో చేరింది.
శర్వానంద్‌పై వచ్చే ఈ పాటని ప్రదీప్ కుమార్ ఆలపించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. గోవింద్ వసంత సంగీతం అందించారు. ఇక ఈసినిమా తమిళంలో వచ్చిన `96`కి రీమేక్. అందులో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు.అక్కడ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో మాత్రం ప్రశంసలు తప్ప కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. అయితే మూడేళ్ల క్రితం విడుదలైన తమిళంలోని `లైఫ్ ఆఫ్ రామ్` పాట ఇంకా 77 మిలియన్స్ వ్యూస్ దగ్గరే ఆగిపోయింది. కానీ తెలుగులో వచ్చిన ఈ పాట వంద మిలియన్స్ వ్యూస్ సాధించడం విశేషం.
అల్లు అర్జున్ నటించిన `అలా వైకుంఠపురములో`ని బుట్టబొమ్మ, రాములో రాముల.. `లవ్ స్టోరి`లోని సారంగ దరియా.. వంటి పాటలు వంద మిలియన్స్ వ్యూస్ సాధించిన జాబితాలో ముందున్నాయి. తాజాగా వాటి సరసన `లైఫ్ ఆఫ్ రామ్` చేరిందని చెప్పొచ్చు. ఇది ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కావడం విశేషం. ఇందులోని చాలా పాటలు వంద మిలియన్స్ క్లబ్‌లో చేరాయి.

