కొన్నాళ్లుగా చరణ్, శంకర్ కాంబినేషన్ లో మూవీ అంటూ వార్తలు రావడం జరిగింది. అవి ఒట్టి పుకార్లే అని కొట్టేసిన చాలా మందికి షాకిస్తూ శంకర్-చరణ్ కాంబినేషన్ సెట్ అయ్యింది. అది కూడా దిల్ రాజు లాంటి మెగా ప్రొడ్యూసర్ ల్యాండ్ మార్క్ మూవీ కావడం మరో విశేషం.
దేశం మెచ్చిన దర్శకులలో శంకర్ ఒకరు. వెండితెరకు గ్రాండియర్ పరిచయం చేసిన శంకర్ చేసిన అద్భుతాలు అనేకం. సోషల్ కాన్సెప్ట్ అయినా, సైంటిఫిక్ ఫిక్షన్ అయినా, స్టార్ హీరోల ఇమేజ్ కి తగ్గట్లు, కమర్షియల్ అంశాలు జోడించి తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. మరి అలాంటి దర్శకుడితో రామ్ చరణ్ మూవీ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. అసలు శంకర్ సినిమా అంటేనే సెన్సేషన్.
కొన్నాళ్లుగా చరణ్, శంకర్ కాంబినేషన్ లో మూవీ అంటూ వార్తలు రావడం జరిగింది. అవి ఒట్టి పుకార్లే అని కొట్టేసిన చాలా మందికి షాకిస్తూ శంకర్-చరణ్ కాంబినేషన్ సెట్ అయ్యింది. అది కూడా దిల్ రాజు లాంటి మెగా ప్రొడ్యూసర్ ల్యాండ్ మార్క్ మూవీ కావడం మరో విశేషం. విజయాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా చెప్పుకునే దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కనుంది.
దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న 50వ చిత్రం కాగా భారీ లెవెల్ లో పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారు. నేడు దీనిపై అధికారిక ప్రకటన రాగా, ప్రాజెక్ట్ పట్ల చాలా ఎక్సైటెడ్ గా ఉన్నట్లు దర్శకుడు శంకర్, హీరో రామ్ చరణ్ ట్వీట్స్ చేశారు. ఇక మిగతా నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.
