ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ ఆదిపురుష్ నేడు వరల్డ్ వైడ్ రికార్డు స్థాయిలో విడుదలైంది. కాగా ఈ చిత్ర డిజిటల్ పార్టనర్ పై అధికారిక సమాచారం అందుతుంది.  

ప్రభాస్ కెరీర్లో ఆదిపురుష్ స్పెషల్ మూవీ. ఆయన ఐకానిక్ రాముని పాత్ర చేశారు. గతంలో ప్రభాస్ పౌరాణిక చిత్రం చేసింది లేదు. దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ చిత్ర హీరోగా ప్రభాస్ ని ఎంచుకున్నారు. రాఘవుడు పాత్రకు ప్రభాస్ చక్కని ఎంపిక అని భావించారు. దర్శకుడు నమ్మకం వమ్ము కాలేదు. రాముడిగా ప్రభాస్ అద్భుతం చేశాడన్నమాట వినిపిస్తుంది. కాగా ఆదిపురుష్ మూవీ డిజిటల్ పార్టనర్ అమెజాన్ ప్రైమ్ అని సమాచారం అందుతుంది. 

టైటిల్స్ తో పాటు డిజిటల్ పార్టనర్ ని రివీల్ చేశారు. అమెజాన్ ప్రైమ్ ఆదిపురుష్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. దాదాపు రూ. 150 కోట్లకు ఆదిపురుష్ చిత్ర ఓటీటీ హక్కులు ప్రైమ్ దక్కించుకున్నట్లు సమాచారం. ఐదు భాషల స్ట్రీమింగ్ రైట్స్ కొన్నారట. ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా నాలుగు వారాల్లో ఆదిపురుష్ ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంటుంది. 

టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఆదిపురుష్ మూవీ నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జానకి పాత్ర చేశారు. సన్నీ సింగ్ లక్ష్మణుడు పాత్రలో ఆకట్టుకున్నారు. ఇక కీలకమైన లంకేశ్వరుడు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ మెప్పించారు. అజయ్-అతుల్ సంగీతం అందించారు. ఫస్ట్ డే ఆదిపురుష్ రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉన్నాయి.