2024 సమ్మర్ కి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ పోటీపడే అవకాశం కలదంటున్నారు. ఈ రెండు చిత్రాలు రోజుల వ్యవధిలో విడుదలయ్యే సూచనలు కలవు.
టాలీవుడ్ టాప్ స్టార్ ఎన్టీఆర్(NTR), పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఈ మేరకు కథనాలు వెలువడుతున్నాయి. దేవర, ఓజీ మధ్య బాక్సాఫీస్ వార్ ఉండే సూచనలు కలవంతున్నారు. దర్శకుడు కొరటాల శివ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దేవర తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో దేవర రూపొందుతోంది. చిత్రీకరణ మొదలు కాకుండానే విడుదల తేదీ ప్రకటించారు. 2024 ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు.
చెప్పిన ప్రకారం సినిమాను విడుదల చేయాలని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. వరుస షెడ్యూల్స్ తో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేయాలనేది టార్గెట్ అని సమాచారం. ఈ చిత్ర సీజీ వర్క్ అధిక మొత్తంలో ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం తీసుకుంటుందని అంటున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న దేవర(Devara)ను ఎలాగైనా సమ్మర్ కానుకగా విడుదల చేయాలని టీమ్ ధృడ సంకల్పంతో ఉంది.
అదే సమయంలో ఓజీ టీమ్ కూడా సమ్మర్ బరిలో నిలవాలని చూస్తున్నారట. దర్శకుడు సుజీత్ పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఓజీ తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ ఓ 50 శాతం వరకు కంప్లీట్ అయ్యిందట. ఇక సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్(HBD Pawan Kalyan) బర్త్ డే కానుకగా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇది అంచనాలు అందుకుంది. టీజర్లో పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్, థమన్ మ్యూజిక్ ఆకట్టుకుంది. అయితే విక్రమ్ సినిమాలోని అనిరుధ్ మ్యూజిక్ ఇమిటేట్ చేశాడనే వాదన వినిపిస్తోంది.
డివివి దానయ్య నిర్మిస్తున్న ఓజీ(OG) టార్గెట్ కూడా సమ్మర్ అంటున్నారు. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు కాగా... ఎన్నికలకు ముందే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ టార్గెట్ అట. ఈ క్రమంలో ఓజీ 2024 ఏప్రిల్ లో విడుదల కావడం ఖాయమంటున్నారు. ఈ క్రమంలో దేవర, ఓజీ సమ్మర్ బరిలో పోటీపడవచ్చని కొందరి అంచనా. ఇదిలా ఉంటే పుష్ప 2 సైతం ఇదే సీజన్ టార్గెట్ గా తెరకెక్కుతోందని అంటున్నారు. చూస్తుంటే వచ్చే ఏడాది సమ్మర్ భారీ చిత్రాలతో బాక్సాఫీస్ హోరెత్తనుంది.
