బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. అయితే ఇక్కడ మ్యాటరేంటంటే.. అతడికి ఇంకా పెళ్లి కాలేదు. చాలా రోజులుగా తన ప్రేయసి గాబ్రియేలాతో సహజీవనం చేస్తున్నాడు.

ఇప్పుడు ఆమె గర్భవతి. నిజానికి అర్జున్ కి గతంలో పెళ్లైంది. ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. కానీ గతేడాదిలో తన భార్య నుండి విడాకులు తీసుకున్న అర్జున్ అప్పటినుండి  గాబ్రియేలాతో కలిసి ఉంటున్నాడు. గాబ్రియేలా సౌత్ ఆఫ్రికాకు చెందిన మోడల్.

ముంబైలో జరిగిన ఓ పార్టీలో ఆమెకు అర్జున్ తో పరిచయం ఏర్పడడం, అది కాస్త ప్రేమగా మారడం జరిగాయి. ఇప్పుడు ఈ జంట ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. మరి పెళ్లెప్పుడు చేసుకుంటారో..?

ఇక అర్జున్ మొదటి భార్య కూతురు త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే సమయానికి ఇతడికి మరో బిడ్డ పుట్టనుంది.