టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబుకు చెందిన రామానాయుడు స్టూడియోపై ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. ఈ ఉదయం సురేష్ బాబుకు చెందిన పలు కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ ఉదయం నుంచి దాడులు మొదలైనట్లు తెలుస్తోంది. 

మూవీ మొఘల్ రామానాయుడు కుమారులుగా సురేష్ బాబు, వెంకటేష్ ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. వెంకటేష్ టాలీవుడ్ లో అగ్ర హీరోగా, సురేష్ బాబు అగ్ర నిర్మాతగా ఉన్నారు. దీనితో రామానాయుడు స్టూడియోతో సహా సురేష్ బాబు నివాసం, సురేష్ ప్రొడక్షన్ కార్యలయాల్లో ఐటి అధికారులు తనిఖీలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. 

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కాయి. సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు స్టూడియో లావాదేవీలపై అనుమానాలు రావడంతో ఐటీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ జరిగిపిన లావాదేవీల వివరాలకు సంబందించిన డాక్యుమెంట్స్ ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్ ఐటి వింగ్ విభాగం ఈ సోదాలు నిర్వహిస్తోంది. గత నాలుగేళ్లుగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఐటి లెక్కల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తిచడంతో అకస్మాత్తుగా ఈ దాడులు నిర్వహించారు.