మరోసారి ఐటీ అధికారుల దాడులతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. గత కొన్ని నెలలుగా ఐటీ అధికారులు టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థలపై కన్నేసి ఉంచారు.

మరోసారి ఐటీ అధికారుల దాడులతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. గత కొన్ని నెలలుగా ఐటీ అధికారులు టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థలపై కన్నేసి ఉంచారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అనుమానాలు వచ్చినప్పుడల్లా రంగంలోకి దిగేస్తున్నారు.

నిర్మాతల ఇళ్లపై, ఆఫీస్ లపై సోదాలు చేయడం సహజమే కానీ ఈసారి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఐటీ అధికారులకు టార్గెట్ గా మారారు. తాజాగా ఐటీ అధికారులు మైత్రి సంస్థ నిర్మాతలు రవిశంకర్, నవీన్ నివాసాలు ఆఫీస్ లపై అధికారులు సోదాలు జరిపారు. అలాగే మైత్రి సంస్థతో మంచి సంబంధాలు ఉన్న డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై కూడా దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ ఏడాది వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకుంది. అదే క్రమంలో స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు ప్రకటిస్తున్నారు. ఈ సంస్థలోనే అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. 

ఈ చిత్రానికి సుకుమార్ దర్శకులు. అలాగే సుకుమార్ పలు చిత్రాలకు పార్ట్నర్ గా వ్యవహరిస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్థికలావాదేవీలు భారీ స్థాయిలో ఉంటాయి అనే అనుమానంతో ఐటీ అధికారులు సుకుమార్ నివాసం, ఆఫీస్ పై దాడులు చేస్తున్నారు. 

కీలకమైన డాక్యుమెంట్స్ కోసం ఐటీ అధికారుల వేట కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ నిర్మాణ భాగస్వామిగా తెరకెక్కిన సాయిధరమ్ తేజ్ విరూపాక్ష చిత్రం ఏప్రిల్ 21న రిలీజ్ కి రెడీ అవుతోంది. మరి పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు ఐటీ అధికారుల చిక్కుల నుంచి ఎలా బయటపడతారో చూడాలి. గతంలో దిల్ రాజు ఆఫీస్, హారిక అండ్ హాసిని సంస్థపై కూడా ఐటీ దాడులు జరిగాయి.