అల్లు అరవింద్ ప్రొడక్షన్ హౌస్ కి ఐటి అధికారులు షాక్ ఇచ్చారు.గత ఏడాది విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న  గీత గోవిందం సినిమా 130 కోట్లకు పైగా వసూళ్లు అందుకుందని కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ఆదాయంపై ఆరా తీసేందుకు శుక్రవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 

సినిమాను నిర్మించిన ప్రొడక్షన్ సంస్థ GA2 యాజమాన్యాన్ని అధికారులు ప్రశ్నించారు. హైదరాబాద్‌ ఐటీ యూనిట్‌-14 బృందం.. వారి ఆఫీస్ లో కొన్ని గంటలపాటు తనిఖీలు నిర్వహించడంతో ఒక్కసారిగా ఈ వార్త టాలీవుడ్ లో వైరల్ గా మారింది. 130 కోట్ల వరకు వసూళ్లు ఉండడంతో పన్ను చెలింపుల విషయంలో సంస్థ అధినేతలను ఇతర కార్యాలయ సిబ్బందిని కూడా అధికారులు విచారించారు. 

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న హీరో హీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్ లో ఈ సినిమా అత్యధిక వసూళ్లను అందుకుంది. ఇక GA2 పిక్చర్స్ గత చిత్రాలకు సంబందించిన ఆదాయం విషయంలో కూడా అధికారులు సంస్థ అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.