పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా పెట్టి సినిమా చేయడం తన వల్ల కాదని రామ్ గోపాల్ వర్మ అన్నారు. పవన్‌కు ఉన్న ఇమేజ్‌, హీరోయిజం, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, ఆయన అభిమానులకు ఉండే అంచనాలకు తగ్గట్టు సినిమా చేయడం నాకు చేతకాదని అన్నారు ఆర్జీవీ.  'దెయ్యం' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను హీరోయిజం చూపించే కమర్షియల్‌ చిత్రాల కంటే ఎక్కువగా జోనర్‌ చిత్రాలను తెరకెక్కిస్తానని అన్నారు. అలాంటి చిత్రాల్లో స్టార్‌ హీరోలను తీసుకుంటే అది వాళ్లకే కాదు.. సినిమాకు కూడా మంచిది కాదు. అలాగే, కమర్షియల్‌ హంగులతో చిత్రాలు తీయాలనే ఆసక్తి కూడా నాకు లేదని రామ్‌గోపాల్‌ వర్మ వివరించారు.

ఇక సినిమాలపరంగా కాకుండా వ్యక్తిగతంగా తాను పవన్‌ అభిమానిని అన్నారు ఆర్జీవీ. పవన్‌ నటించిన సినిమాలు చాలా తక్కువ చూశాను..ఇటీవల విడుదలైన వకీల్‌సాబ్‌ కూడా చూడలేదు. కానీ, ట్రైలర్‌ చూశాను. బాగా నచ్చింది. అలాగే ఆ సినిమాకి వచ్చిన రివ్యూలు విన్నాను అని ఆర్జీవీ తెలిపారు. పవన్ హీరోగా సినిమా చేయడం తనకు చేత కాదని అన్నాారు.
  
 'దెయ్యం' సినిమాలో రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.