దర్శకుడు పూరి జగన్నాథ్ పక్కా కమర్షియల్ మాస్ సినిమాలను రూపొందిస్తుంటాడు. అతడి సినిమాల్లో హీరోయిజానికి పెద్ద పీట వేస్తుంటాడు. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ ని బాగా ఎలివేట్ చేస్తుంటారు. హీరోయిజం చుట్టూనే కథ తిరుగుతుంటుంది తప్పకాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథల జోలికి అసలు పోడు.

డైలాగ్స్, ఎలివేషన్ సన్నివేశాలతో సినిమాను నడిపిస్తుంటాడు. అయితే అతడి తాజా చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' కోసం మాత్రం ఓ వెరైటీ స్టోరీ ఎంచుకున్నాడని సమాచారం.  ఇప్పటివరకు విడుదలైన సినిమా పోస్టర్లు, టీజర్ బట్టి చూస్తుంటే పాతబస్తీ కుర్రాడు చేసే దందా నేపధ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. 

ఇప్పుడు ఈ లైన్ కి సరికొత్త కాన్సెప్ట్ ని జోడించినట్లు తెలుస్తోంది. అదేంటంటే.. బ్రెయిన్ ఎక్స్ చేంజ్. ఇందులో హీరో రామ్ అనుకోకుండా ప్రమాదానికి గురవుతాడట. అప్పుడు అతడి బ్రెయిన్ దెబ్బ తింటుంది. దీంతో రామ్ కి మరో బ్రెయిన్ అమరుస్తారు. అక్కడ నుండి కథ రూపం మొత్తం మారిపోతుందట.

ఆ కారణంగానే టైటిల్ కి 'డబుల్ దిమాఖ్' అనే ట్యాగ్ ని జోడించారని సమాచారం. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.