ఇటీవల విడుదలైన 'గద్దలకొండ గణేష్' సినిమాతో సక్సెస్ అందుకున్న హీరో వరుణ్ తేజ్.. తాజాగా మరో సినిమాకి సైన్ చేశాడు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందిస్తోన్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో రినైసాన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేష్ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ రోల్ కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. ముంబైలో కొందరు ఎక్స్ పర్ట్స్ వరుణ్ తేజ్ కి బాక్సింగ్ నేర్పిస్తున్నారు.

'అయోధ్య రామమందిరం' కథతో బాహుబలి రచయిత.. క్రేజీ హీరోయిన్ మాస్టర్ ప్లాన్!

క్రీడా నేపధ్యంలో సాగే ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ కథ మీద ఉన్న నమ్మకంతో అలానే వరుణ్ తేజ్ మార్కెట్ దృష్టిలో 
పెట్టుకొని రూ.40 కోట్ల బడ్జెట్ లో ఈ సినిమాని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ సెపరేట్ గా ఉంటుందని తెలుస్తోంది.

ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ కి రూ.9 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వరుణ్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోలేదు. నాని, శర్వానంద్ లాంటి హీరోలకు కూడా ఈ స్థాయిలో రెమ్యునరేషన్లేదు.

కానీ వరుణ్ తేజ్ తన సక్సెస్ ట్రాక్ కారణంగా భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ లోనే ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ అని చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జూలై, ఆగస్ట్ నెలల్లో ఈ సినిమాని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.