ఈ మథ్య కాలంలో పక్కా మాస్‌ మసాలా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ఏదీ రాలేదు. ఆ లోటుని  ఇస్మార్ట్‌ శంకర్‌ తీరుస్తోంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మూడు రోజుల్లోనే కలెక్షన్స్ దుమ్ము దులిపేసి, సేఫ్‌ జోన్‌లోకి ఎంటర్‌అయిపోయింది. ఈ విషయాన్ని నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించారు.  మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా 36 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు.

ఈ ఆదివారం రోజు కూడా కలెక్షన్లు భారీగా ఉన్నాయని చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్ లు పడ్డాయి దీంతో  ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికే  ఇస్మార్ట్‌ శంకర్‌ 50 కోట్ల మార్క్‌ను చేరుకునే అవకాశం ఉంటుందని ట్రేడ్ లో లెక్కలు వేస్తున్నారు. అలాగే వరస ప్లాప్ లత తరువాత పూరి జగన్నాథ్‌ ఈ స్దాయి హిట్‌ సాధించటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.  

హీరో రామ్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌.. ఇద్దరూ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఇస్మార్‌ శంకర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా రామ్‌ను పూర్తిగా కొత్త అవతారంలో కొత్త క్యారెక్టర్‌లో చూపించాడు పూరి. ట్రైలర్‌లు, సాంగ్స్‌ సినిమాకు మాస్‌ ఇమేజ్‌ తీసుకువచ్చాయి. ఆ అంచనాలను ఇస్మార్ట్‌ శంకర్‌ అందుకోవటం కలిసొచ్చింది. 

మరీ ముఖ్యంగా పూరి హీరోయిజం కి రామ్ ఎనర్జీ తోడవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ రేంజిలో ఇస్మార్ట్ శంకర్ పేలింది.వసూళ్ల పరంగా కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించటం ట్రేడ్ కు షాక్ ఇస్తోంది.