అసలే అంతంతమాత్రంగా ఉంది బెల్లంకొండ శ్రీనివాస్ పరిస్దితి. రీసెంట్ గా 'సీత’ తో  పలకరించిన బెల్లంకొండ శ్రీనివాస్ ...ఆ సినిమా డిజాస్టర్ కావటంతో హిట్ కోసం డెస్పరేట్ గా ఎదురుచూస్తున్నారు. అందుకోసం ఆల్రెడీ ప్రూవ్ అయిన తమిళంలో సూపర్ హిట్ ‘రాచ్చసన్’ రీమేక్ ఎంచుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’తో పేరుతో రీమేక్ చేసి రిలీజ్ కు రెడీ చేసారు.

రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బెల్లంకొండ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఆ మద్యన ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్సే వచ్చింది.  దాంతో అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై 18న  అభిషేక్ పిక్చ‌ర్స్ ద్వారా విడుద‌ల చేస్తున్నారు.

అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో పూరి జగన్నాథ్, ఛార్మి తీసుకున్న నిర్ణయం వల్ల ట్విస్ట్ వచ్చి పడింది. అదేమిటంటే ..అదే జూలై 18న పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రం రిలీజ్ పెట్టుకున్నారు. దాంతో తమ చిత్రం రిలీజ్ ఉందని తెలిసి కూడా మాట మాత్రమైనా చెప్పకుండా ఇలా చేయటం ధర్మం కాదంటున్నారు.

ఒకే రోజు రెండు పెద్ద రిలీజ్ లు ఉంటే థియోటర్స్ షేర్ చేసుకోవాల్సిన పరిస్దితి వస్తుందని చెప్తున్నారు. బెల్లంకొండ వాదనలోనూ నిజం ఉంది. ఎందుకంటే జనం ఇస్మార్ట్ శంకర్ ని మొదట చూడాలనుకుంటారు. ‘రాక్షసుడు’కు సోలో రిలీజ్ ఉంటేనే కలిసి వస్తుంది. మంచి ఓపినింగ్స్ వస్తాయి. ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ ఉంటే..అంతా ఆ సినిమా గురించే మాట్లాడతారు. హిట్ అయినా..ఫ్లాఫ్ అయినా ఆ సినిమానే ట్రెండింగ్ లో ఉంటుంది. ఎందుకంటే పూరి జగన్నాథ్ కు, రామ్ కు మార్కెట్లో ఉన్న క్రేజ్ అలాంటిది.