మూవీ : ఇజంనటీనటులు : కళ్యాణ్ రామ్, అధితి ఆర్య, జగపతి బాబు, పోసానిసంగీతం : అనూప్ రుబెన్స్దర్శకత్వం : పూరి జగన్నాథ్నిర్మాత : నందమూరి కళ్యాణ్ రామ్
కథ :
సినిమాలో మెయిన్ విలన్ కేరక్టర్ జావేద్ ఇబ్రహీం... విదేశాల్లో ఉండి ఇండియాలోని పొలిటికల్ లీడర్స్ మనీని, బిజినెస్ వ్యవస్థలను కంట్రోల్ చేస్తుంటాడు జావేద్. డబ్బు కోసం ఎలాంటి పనులకైనా తెగబడే జావేద్ కు.. తన కూతురంటే ప్రాణం. జావేద్ కూతురు అలియా ఖాన్( హీరోయిన్ అదితి ఆర్య) దేశాన్ని గడగడలాడించే జావేద్ భాయిని వణికించే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది.
ఇక హీరో కళ్యాణ్ రామ్ ( కళ్యాణ్ రామ్) స్ట్రీట్ ఫైటర్ కేరక్టర్లో అలియాకు తారస పడతాడు. అలియా, జావేద్ భాయ్ కూతురు అని తెలిసి కూడా ఆమె వెంటపడతాడు కళ్యాణ్. మొదట్లో కాస్త దూరంపెట్టినా చివరకు పడిపోతుంది. అయితే.. కళ్యాణ్ కు అలియా పడిపోవడంలో సహకరించేది మాత్రం జావెద్. ఓసారి కరీంబీడీ కోసం పడిచచ్చే జావెద్ ఆబీడీ కోసం వెతుకుతుంటే... కళ్యాణ్ ఆ బీజీ తాగుతూ కనిపిస్తాడు. అలా ఇద్దరి మధ్య బీడీ ఫ్రెండ్ షిప్ కుదురుతుంది. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగటం, కళ్యాణ్ తన ప్రేమ విషయం జావెద్ భాయ్ తో చెప్పడం, దానికి భాయ్ సహకరించడం సహజంగా జరిగిపోతాయి.
ఇంత జరిగాక తను ప్రేమ పాఠాలు చెప్పి సహకారం అందించింది తన కూతురు అలియాను ప్రేమలో దింపటానికే అని తెలుస్తుంది జావెద్ భాయ్ కి. అలా విషయం తెలుసుకున్న జావేద్, కళ్యాణ్‑ను చంపేయాలనుకుంటాడు. కొంతకాలం కళ్యాణ్, జావేద్ కు కనిపించకుండా పోతాడు. అయితే.. కళ్యాణ్ అసలు కేరెక్టర్ ఏంటి.. తన మిషన్ ఏంటి... దాన్ని ఎలీ ముందుకు తీసుకెళ్లాడు అన్నదే కథ.
జావేద్ కళ్యాణ్ ను అంతం చేసేందుకు తిరుగుతున్న సమయంలో జావేద్ ఎక్కడుంటున్నాడు అన్న వివరాలతో పాటు, అతనితో సంబంధం ఉన్న బడా నేతల వివరాలు గ్రాండ్ లీకేజ్ కంపెనీ సైట్లో ప్రత్యక్షమవుతాయి. అత్యంత రహస్యంగా ఉండే జావేద్ భాయ్ వివరాలు ఎలా బయటకు వచ్చాయి. గ్రాండ్ లీకేజ్ కంపెనీకి కళ్యాణ్ రాంకు ఉన్న సంబంధమేంటి..? చివరకు జావేద్ ఖేల్ ఎలా ఖతమైంది..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
బాడీలాంగ్వవేజ్ పూర్తిగా మార్చేసుకొని కొత్త అవతారంలో కనిపించిన కళ్యాణ్ రామ్ తనదైన మేనరిజంతో ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్‑లో స్ట్రీట్ ఫైటర్‑గా అల్లరి పాత్రలో మెప్పించిన కళ్యాణ్ రామ్, సెకండ్ హాఫ్‑లో వచ్చే ఎమోషనల్ సీన్స్‑తో మరింతగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ 20 నిమిషాల పాటు సినిమా వన్ మేన్ షోగా నడిచింది. హీరోయిన్ అదితి ఆర్య పర్ఫామెన్స్ ఇంకా మెరుగుపడాల్సి వున్నా.. లుక్స్ అలరించాయి. విలన్ రోల్ లో జగపతి బాబు మరోసారి అదుర్స్ అనిపించాడు. దేశాన్ని గడగడలాండిచే డాన్ పాత్రలో, కూతురి కోసం ఏమైనా చేసే తండ్రి రోల్ లో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళీ, తనికెళ్ల భరణి పాత్రలు ఆకట్టుకున్నాయి.
సాంకేతిక నిపుణులు :
సినిమా తొలి ఫ్రేం నుంచి పక్కా పూరి మార్క్ సినిమా అన్నట్టుగా తెరకెక్కించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. హీరోయిన్ వెంటపడి అల్లరి చేసే హీరో, డబ్బు కోసంఎలాంటి పనికైనా సిద్దపడే విలన్లు పూరి సినిమాల్లో సహజంగా కనిపించినవే. అయితే కథాంశంలో సీరియస్ నెస్ తెరపై సరిగ్గా కనిపించలేదనిపిస్తుంది. బ్లాక్ మనీ లాంటి సీరియస్ ఎలిమెంట్ కథాంశంగా తీసుకున్నప్పుడు దానికి కనెక్టయ్యే కామన్ పీపుల్ అదే తరహా సీరియస్ నెస్ కోరుకుంటారు. అయితే ఆ సీరియస్ నెస్ అనుకున్నంతగా కనిపించలేదు. పైగా ఫస్ట్ హాఫ్ అంతా అస్సలు కథలోకి ఎంటర్ అవ్వకుండా హీరో హీరోయిన్ ప్రేమకథతో లాగించడం విసిగిస్తుంది.
అయితే అప్పుడప్పుడు మెరిపించిన డైలాగ్స్ సినిమాకు అట్రాక్షన్. ఇంటర్వెల్ తరువాత సినిమాలో వేగం పెరుగుతుంది. ముఖ్యంగా జర్నలిస్ట్ జీవితాలు, విలువలు తెలిపేలా రాసిన డైలాగ్స్ బాగున్నాయి. క్లైమాక్స్ పార్ట్ మెప్పించింది. పాటలపై మరింత శ్రద్ద పెట్టి ఉంటే బాగుండనిపించింది, ఒకటి రెండు మినహా పాటలు ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. హీరోగానే కాక నిర్మాతగానూ సినిమాకు వందశాతం న్యాయం చేశాడు కళ్యాణ్ రామ్. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను రిచ్ గా నిర్మించాడు.
ప్లస్ పాయింట్స్ :
కళ్యాణ్ రామ్, క్లైమాక్స్ సీన్
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్, పాటలు
ఫైనల్ గా... ఇజం.. కళ్యాణ్ రామ్ హీరోఇజం, పూరీ డైరెక్షన్ ఇజం
రేటింగ్-2.5/5
