Asianet News TeluguAsianet News Telugu

వినాయక్ ని ఆ వార్తలు బాధపెడుతున్నాయట


యాక్షన్  కమర్షియల్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ గత కొంత కాలంగా రీసెంట్ గా ఫామ్ కోల్పోయారు.  ఈ లోగా హీరోగా అరంగేట్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటి వరకు దర్శకుడిగా తెర వెనక యాక్షన్ చెప్పిన వినయ్.. ఇప్పుడు మరో దర్శకుడు యాక్షన్ చెప్తే, యాక్ట్ చెస్తున్నారు. 

Is VV VINAYAK DEBUT FILM Restart?
Author
Hyderabad, First Published Aug 31, 2020, 12:06 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

స్టార్ డైరక్టర్స్, స్టార్ హీరోలపై మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త నానుతూనే ఉంటుంది. అయితే పాజిటివ్ గా ఆ వార్తలు ఉన్నంతసేపు ఎవరికి ఏ ఇబ్బంది అనిపించదు. కాని కొన్ని న్యూస్ లు వారిని చాలా హర్ట్ చేస్తుంటాయి. అలాంటి న్యూసే ఒకటి వివి వినాయిక్ గురించి మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ న్యూస్ రాసేటప్పుడు పాజిటివ్ గా అనిపించినా, అది చదివే వినాయిక్ కి మాత్రం ఎందుకు ఈ కెలికుడు అనిపిస్తోందిట. ఇంతకీ ఆ వార్త ఏమిటో...దాని విషయం ఏమిటో చూద్దాం...

యాక్షన్  కమర్షియల్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ గత కొంత కాలంగా రీసెంట్ గా ఫామ్ కోల్పోయారు.  ఈ లోగా హీరోగా అరంగేట్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటి వరకు దర్శకుడిగా తెర వెనక యాక్షన్ చెప్పిన వినయ్.. ఇప్పుడు మరో దర్శకుడు యాక్షన్ చెప్తే, యాక్ట్ చెస్తున్నారు. 'ఠాగూర్', 'ఖైదీ నెం:150' సినిమాల్లో కొద్దిసేపు తెరపై తళుక్కుమన్న వినాయక్‌ను పూర్తిస్థాయి హీరోగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ ద్వారా నిర్మాత దిల్ రాజు, లాంచ్ చేస్తూ సినిమా మొదలెట్టారు. 

‘శరభ’ ఫేమ్ ఎన్. నరసింహ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ‘సీనయ్య’ (కంప్లీట్ ఎమోషన్) అనే టైటిల్ పెట్టారు. శీనయ్య అనే టైటిల్ తో వినాయక్ సినిమా చేస్తున్నాడని ప్రకటించారు. దీనికి సంబంధించిన లుక్స్ కూడా విడుదలయ్యాయి. వినాయక్ పూర్తిగా తన లుక్ ను మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనుండగా నరసింహారావు డైరక్షన్ చేయనున్నారు. అంతా బాగానే ఉందనగా..ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.

 దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు ఇక ఈ ప్రాజెక్ట్ ను పూర్తిగా సైడ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకున్నారురు. వినాయక్ ఇక  నటనకు ఫుల్ స్టాఫ్ పెట్టి మళ్ళీ దర్శకత్వంపై దృష్టి పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు  ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని న్యూస్ లు మొదలయ్యాయి. శీనయ్య ఆగిపోలేదట. ఈ చిత్ర దర్శకుడు నరసింహారావు మాట్లాడుతూ ఈ సినిమా కచ్చితంగా తెరకెక్కుతుందని, లాక్ డౌన్ సమయంలో కథా చర్చలు కూడా జరిగినట్లు రివీల్ చేసాడు. దిల్ చిత్రాన్ని డైరెక్ట్ చేసి తనను నిర్మాతగా నిలబెట్టిన వినాయక్ ను హీరోగా పరిచయం చేయాలని దిల్ రాజు పట్టుదలగా ఉన్నాడని అంటున్నారు.

ఈ న్యూస్ లు అన్నీ వినాయిక్ ని చాలా బాధపెడుతున్నాయట. అసలు ఈ సినిమా గురించిన వార్తలు వినటానికి ఆయనకు ఆసక్తి లేదట. తను మర్చిపోతూంటే..ఏదో పుండు మీద కారం జల్లినట్లు ఈ మీడియా కెలుకుతుందేంటి అని బాధపడుతున్నారట. 
  
ఇక ఈ చిత్రం  ఫస్ట్ లుక్‌లో ఆయన మెడలో ఎర్ర కండువాతో.. పెద్ద రెంచీ పట్టుకుని ఉన్నారు. గ్యారేజ్ బ్యాక్ డ్రాప్ చూస్తుంటే మెకానిక్‌గా కనిపించనున్నారని అర్థమవుతుంది. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. కెమెరా : సాయి శ్రీరామ్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, మాటలు : డార్లింగ్ స్వామి, ఆర్ట్ : కిరణ్ కుమార్, నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి.
 

Follow Us:
Download App:
  • android
  • ios