Asianet News TeluguAsianet News Telugu

విశాల్ హడావిడి... అసలు ఆలోచన అదా?

యాక్షన్‌ హీరో విశాల్‌, జెర్సీ ఫేమ్‌ శ్రద్దా శ్రీనాథ్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘చక్ర’. ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌తో చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్నడ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్ర తెలుగు వర్షన్‌ ట్రైల‌ర్‌ను రానా ద‌గ్గుబాటి సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. 

is Vishal in A Hurry?
Author
Hyderabad, First Published Jun 29, 2020, 9:53 AM IST

కరోనా ప్రభావంతో థియోటర్స్ ఇప్పుడిప్పుడే తెరిచే పరిస్దితి కనబడటం లేదు. అలాగని ఓటీటిలకు వెళ్దాము అంటే అనుకున్న రేట్లు రావటం లేదు. ఓటీటి చిన్న సినిమాలకు కొంత ఊరటగా ఉన్నా ఓ మాదిరి నుంచి పెద్ద సినిమాలకు ఆర్దికంగా గిట్టుబాటు కాదు. ఓ సారి ఓటీటిలో రిలీజ్ చేస్తే ఇక థియోటర్ రిలీజ్ కు పనికిరాదు. ఈ నేపధ్యంలో పెద్ద నిర్మాతలు అసలు ఓటీటి వైపుకు చూడకూడదని నిర్ణయించుకున్నారు. కానీ అటు చిన్న ఇటు భారీ కాని సినిమాల పరిస్దితే త్రిశంకు స్వర్గంలా మారింది. ఈ నేపధ్యంలో నటుడు విశాల్ తాజా చిత్రం ఎక్కడ రిలీజ్ చేయాలనే డైలమోలో ఉన్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే..యాక్షన్‌ హీరో విశాల్‌, జెర్సీ ఫేమ్‌ శ్రద్దా శ్రీనాథ్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘చక్ర’. ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌తో చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్నడ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్ర తెలుగు వర్షన్‌ ట్రైల‌ర్‌ను రానా ద‌గ్గుబాటి సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దాంతో హటాత్తుగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయటంతో అందరూ ఈ సినిమాని ఓటీటికు ఇవ్వటానికే విశాల్ ఫిక్స్ అయ్యాడని అనుకున్నారు. 

కానీ  “చాలా ఓటీటి సంస్దలు మమ్మల్ని ఎప్రోచ్ అవుతున్నా, బడ్జెట్ ఎక్కవ కావటంతో మేము థియోటర్ రిలీజ్ కే ప్లాన్ చేస్తున్నాం,” అని టీమ్ చెప్తోంది. కానీ విశాల్ మాత్రం వేరే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడంటున్నారు. ట్రైలర్ ద్వారా క్రేజ్ తెచ్చి..ఓటీటిల నుంచి ఎక్కువ మొత్తం డిమాండ్ చేసి  తీసుకుని రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనగా చెప్తున్నారు. కానీ అలాంటిదేమీ లేదని టీమ్ చెప్తోంది.ఇప్పుడిప్పుడే థియోటర్స్ రీ ఓపెన్ చేయరు అని విశాల్ కు స్పష్టంగా తెలుసు. మరి అలాంటి ఆలోచన లేనప్పుడు ఎందుకు అంత కంగారు, థియోటర్ రిలీజ్ కోసం అయితే అప్పటికి ఈ ట్రైలర్ ని మర్చిపోతారు కదా  అని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి.

బ్యాంక్ అండ్ హౌజ్‌ రాబ‌రీ, ఫోన్ హ్యాకింగ్‌, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అత్యుత్తమ టెక్నాలజీతో రూపొందించిన ఈ చిత్రం ‘అభిమన్యుడు’ తరహాలో ఆకట్టుకునే విధంగా ఉంది.  మిలటరీ ఆఫీసర్‌గా విశాల్‌ కనిపించడం, యాక్షన్‌ సీన్లు ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, మనోబాలా, రోబో శంకర్‌, విజయ, సృష్టిడాంగే తదితరులు నటిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios