Asianet News TeluguAsianet News Telugu

మంచు విష్ణు మూవీలో ప్రభాస్ నటించడానికి కారణం ఇదే!


ప్రభాస్ కన్నప్ప మూవీలో నటించడం ఖాయమే. దీనిపై పరోక్షంగా మంచు విష్ణు కూడా క్లారిటీ ఇచ్చారు. ఆయన చేసే పాత్ర ఏంటి? ఎందుకు చేస్తున్నారనే ఉత్కంఠ కొనసాగుతుంది. 
 

is this the reason why prabas doing in machu vishnu kannappa ksr
Author
First Published Sep 11, 2023, 10:26 PM IST


హీరో మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ తో మంచు విష్ణు కన్నప్ప ప్రాజెక్ట్ చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో ఆగస్టు నెలలో పూజా కార్యక్రమాలు జరిపి చిత్రం ప్రారంభించారు. మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఆయన ఓ కీలక రోల్ కూడా చేస్తున్నారని సమాచారం. బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. హిందీ మహాభారతం సీరియల్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. 

ఈ ప్రాజెక్ట్ గురించి ఓ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. హీరో ప్రభాస్(Prabhas) కన్నప్పలో కీలక రోల్ చేస్తున్నారట. మంచు విష్ణు హీరోగా తెరకెక్కే మూవీలో ప్రభాస్ నటించడం ఊహించని పరిణామం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ వార్త నిజమే అంటున్నారు. ప్రభాస్ ఓ పాత్ర చేస్తే అది సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. ప్రచారం కల్పిస్తుంది. మార్కెట్ కోల్పోయిన మంచు విష్ణు మూవీకి ప్రభాస్ కారణంగా వసూళ్లు దక్కుతాయి. 

కాగా కన్నప్ప ప్రభాస్ డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. పెదనాన్న కృష్ణంరాజు కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రం. పెదనాన్న నటించిన చిత్రాల్లో భక్త కన్నప్ప నాకు చాలా ఇష్టం. దాన్ని రీమేక్ చేసే ఆలోచన ఉందన్నారు. అనూహ్యంగా కన్నప్ప సినిమాను మంచు విష్ణు ప్రకటించారు. ఆ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడంటూ వార్తలు రావడం కీలకంగా మారింది.  ప్రభాస్ నటించడం ఓకే అయ్యింది. 

అయితే ఆయనది క్యామియో రోల్. ప్రభాస్ నటించడం వెనుక చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. మోహన్ బాబుతో ప్రభాస్ బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై మూవీ చేశాడు. ఆ సమయంలో మోహన్ బాబుతో ప్రభాస్ కి మంచి రిలేషన్ ఏర్పడింది. ఆ రిలేషన్ తోనే మంచు విష్ణు దూసుకెళ్తా మూవీకి ప్రభాస్ వాయిస్ ఓవర్ చెప్పాడు. అలాగే ఈ చిత్ర దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ . మహాభారత టెలివిజన్ డైరెక్టర్ అయిన ముఖేష్ కుమార్ సింగ్ తనని  గొప్పగా చూపిస్తాడని బావిస్తున్నాడట. ఇక ప్రభాస్ శివుని పాత్రలో నటిస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios