ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకున్న నటి సన్నీలియోన్, ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ కలిసి ఉన్నారంటే అది మామూలు విషయమా..? కచ్చితంగా అందరి దృష్టి వీరిపై పడుతుంది. తాజాగా ఇటువంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.

కొహ్లీ పోలికలతో ఉన్న ఓ వ్యక్తి, సన్నీలియోన్ కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ లో నడుచుకుంటూ వెళ్లే వీడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. ఈ వీడియో పెట్టిన కొద్ది గంటల్లోనే లక్ష వ్యూస్ వచ్చాయి. నిజానికి కొహ్లీ ఐపీఎల్ మ్యాచ్ కారణంగా బిజీగా ఉన్నారు.

ఆదివారం నాడు హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ మ్యాచ్ కూడా ఆడాడు. అయితే ఈ మ్యాచ్ ప్రారంభం కావడానికి కొద్ది సమయం ముందే ఈ వీడియో బయటకి వచ్చింది. ఇది చూసిన కొహ్లీ అభిమానులు అతడు విరాట్ కొహ్లి కాదని గుర్తుపట్టారు. 

మరి ఆ వీడియోలో ఉన్నది ఎవరంటే..? సన్నీలియోన్ మేనేజర్ సన్నీ రజనీ. ఆయన చూడడానికి అచ్చం కొహ్లిలా ఉండడంతో ఈ వీడియో బాగా వైరల్ అయింది. మరి అంతగా వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి!