Asianet News TeluguAsianet News Telugu

దిల్‌ రాజుకి పోటీగా మారిన ఆ బిగ్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ ?.. బడా నిర్మాత ఫ్రస్టేషన్‌కి అసలు కారణం అదేనా?

నిర్మాత దిల్ రాజు పేరు ఇప్పుడు మారుమోగుతుంది. ఆయన వార్నింగ్‌ ఇవ్వడం హాట్‌ టాపిక్ అయ్యింది. అయితే ఈ నిర్మాత ఫ్రస్టేషన్‌కి అసలు కారణం వేరే ఉందట. 

is that big production house main reason for dil raju frustation ?  arj
Author
First Published Jan 9, 2024, 11:47 PM IST

దిల్‌ రాజు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన పేరు. సంక్రాంతి సినిమాల సమయంలో మరింతగా ఆయన పేరు మీడియాల్లో నానింది. ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. సంక్రాంతి సినిమాల మధ్య పోటీని సెట్‌ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించాడని అంతా అన్నారు. అది ప్రత్యక్షంగా కనిపించింది. మొత్తానికి సంక్రాంతి పోటీ నుంచి రవితేజ నటించిన `ఈగల్‌` మూవీని తప్పించారు. ఆ విషయంలో ఫిల్మ్ ఛాంబర్‌, దిల్‌రాజు సక్సెస్ అయ్యారు. 

అయినా కొన్ని సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదనే వాదన వినిపిస్తుంది. ముఖ్యంగా `హనుమాన్‌` సినిమాకి థియేటర్లు ఇవ్వడం లేదని కామెంట్లు వస్తున్నాయి. దిల్‌ రాజు.. మహేష్‌ బాబు నటించిన `గుంటూరు కారం` చితం నైజాం హక్కులను సొంతం చేసుకున్నారు. దీంతో నైజాం ఏరియాల్లో `హనుమాన్‌`కి నాలుగైదు థియేటర్లు తప్ప ఎక్కువ ఇవ్వడం లేదని, అన్నింటిని బ్లాక్‌ చేశాడని అంటున్నారు. ఇందులో నిజమెంతా అనేది తెలియదు, కానీ ఇదే ఇప్పుడు అటు ఫిల్మ్ నగర్‌లో, ఇటు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

ఓ వైపు ఇది నడుస్తుండగా, దిల్‌ రాజు తమిళ సినిమా `అయలాన్‌` తెలుగు హక్కులను దక్కించుకున్నాడని, ఆయనే ఇక్కడ సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నారని కొన్ని వార్తలు వచ్చాయి. రవితేజ సినిమాని తప్పించి తమిళ సినిమాని ఈ నిర్మాత ఆడిస్తున్నాడని, ఇదే అన్యాయమని ప్రశ్నించారు. దిల్‌ రాజు అన్యాయం చేస్తున్నాడని, తన సినిమాల కోసం ఇతర సినిమాలను చంపేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇక్కడే దిల్‌ రాజుకి మండింది. కొన్ని వెబ్‌ సైట్లు( ఆయన చెప్పినట్టు రెండు సైట్లు) దీన్ని ప్రధానంగా రాశాయట. 

ఈ పరిణామాలన్నింటిని నేపథ్యంలో దిల్‌ రాజుపై వాటిలో నెగటివ్ వార్తలు వస్తున్నాయని ఆయన ఆగ్రహావేశాలకు లోనయ్యాడని తెలుస్తుంది. నిన్న ప్రెస్‌ మీట్‌లో బహిరంగంగానే వారికి వార్నింగ్‌ ఇచ్చాడు. `తాటా తీస్తా` అంటూ హెచ్చరించాడు దిల్‌ రాజు. మరోవైపు ప్రెస్‌ మీట్‌ బయట ఆ సదరు రిపోర్టర్ పై ఫైర్‌ అయ్యాడు నిర్మాత దిల్‌ రాజు. ఇంతగా ఈ నిర్మాత రగిలిపోవడానికి, కంట్రోల్‌ తప్పడానికి కారణం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

తనపై నెగటివ్‌గా రాస్తే ఆయన రియాక్ట్ కావడంలో తప్పులేదు. వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి, కావాలని నెగటివ్‌ ప్రచారం చేస్తే దాన్ని ఎవ్వరైనా ఖండిస్తారు. ఖండించాల్సిందే. వారి స్వలాభం కోసం ఇతరులను వాడుకోవడం, ఇతరులపై బురద చల్లడాన్ని ఎవరూ సహించరు, సమర్ధించారు. అయితే ఇక్కడ అసలు మ్యాటర్‌ అది కాదు. దిల్‌ రాజు ఫ్రస్టేషన్‌కి కారణం వేరే ఉందట. అది బిజినెస్‌ మ్యాటర్‌ అని తెలుస్తుంది. డిస్రిబ్యూషన్‌ రంగంలో, నిర్మాతల మధ్య జరుగుతున్న చర్చ వేరే అని తెలుస్తుంది. 

దిల్‌ రాజు అసలు కోపానికి తమకు పోటీగా మారిన బడా ప్రొడక్షన్‌ హౌజ్‌ అని అంటున్నారు. అది ఎవరో కాదు మైత్రీ మూవీ మేకర్స్ అని తెలుస్తుంది. ఇటీవల ఈ బ్యానర్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసుని ప్రారంభించింది. నైజాంలో భారీగా రిలీజ్‌లు చేస్తుంది. ఇటీవల `సలార్‌`ని వాళ్లే రిలీజ్‌ చేశారు. ఇంకా చాలా సినిమాలను రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పుడు `హనుమాన్‌` చిత్రాన్ని కూడా వాళ్లే రిలీజ్‌ చేస్తున్నారు. అయితే నైజాంలో డిస్రిబ్యూషన్‌ పరంగా తమకి పోటీగా మారడాన్ని ఈ నిర్మాత తట్టుకోలేకపోతున్నాడని, వరుసగా పెద్ద సినిమాలు వాళ్లు కొట్టేయడంతోపాటు సింగిల్‌ స్క్రీన్లని కూడా వాళ్లే తీసుకుంటున్నారట. క్రమంగా దిల్‌ రాజుకి ఇక్కడ థియేటర్లు తగ్గిపోతున్నాయి. దీంతోనే ఆయన ఇలా ఫ్రస్టేషన్‌కి గురవుతున్నట్టు తెలుస్తుంది. 

ఇప్పటి వరకు నైజాంలో దిల్‌ రాజుకి తిరుగులేదు. తనకు అడ్డే లేరు. ఆ మధ్య వరంగల్ శ్రీను మధ్య మధ్యలో ఝలక్‌ ఇచ్చేవారు. కానీ `లైగర్‌` దెబ్బకి ఆయన కనిపించకుండా పోయారు. తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయారు. దీంతో రాజు సింగిల్‌ అయ్యాడు. కానీ ఇంతలో ఈ బడా నిర్మాణ సంస్థ డిస్ట్రిబ్యూషన్‌లోకి రావడం, తమ థియేటర్లని నెమ్మదిగా లాక్కోవడం, తమ బిజినెస్‌ని దెబ్బకొట్టడం కారణంగా దిల్‌ రాజుకి మండిపోతుందని, చాలా కాలంగా తన మనసులో అది నడుస్తుందని, దాన్ని కక్కలేక, మింగలేక ఇలా అనూహ్యంగా ఫ్రస్టేట్‌ అయ్యారని డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ నుంచి వినిపించే మాట. మొత్తంగా దిల్‌రాజుకి, మైత్రీ వాళ్లకి మధ్య వార్‌ జరుగుతుందని అంటున్నారు. మరి ఈ రూమర్స్ లో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే మైత్రీ మూవీ మేకర్స్ బడా హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. వారి చేతిలో పెద్ద పెద్ద సూపర్‌ స్టార్లు ఉన్నారు. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తున్నారు. రావడం రావడంతోనే టాలీవుడ్‌ టాప్‌ హీరోలందరికి అడ్వాన్స్ చెక్కులు ఇచ్చారు. ఒక్కొక్కరితో సినిమాలు చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఇన్ని సినిమాలు ఎలా సాధ్యం, ముందుగా అడ్వాన్స్ చెక్కులను ఇవ్వడం వెనుక ఉన్న కథేంటి అనే తేల్చేందుకు ఆ మధ్య ఐటీ రైడ్స్ నిర్వహించింది. ఆ దాడులు పెద్ద చర్చనీయాంశం అయ్యాయి. నిధుల దుర్వినీయోగం, అక్రమంగా ఎన్‌ఆర్‌ఐ ఫండ్స్ తీసుకొస్తూ ఇలా సినిమాల్లో, రియల్‌ ఎస్టేట్‌లో పెట్టి బ్లాక్‌ మనీని వైట్‌ చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. కానీ దీనిపై ఐటీ అధికారులు ఏం తేల్చలేకపోయారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios