ప్రేమించిన వ్యక్తితో హీరోయిన్ సీక్రెట్ ఎంగేజ్మెంట్!

Is Taapsee Pannu engaged?
Highlights

తాజాగా తాప్సీ, మాథ్యూస్ తో కలిసి గోవాకు వెళ్లింది. అయితే ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా గోవాకు వెళ్లడం అనుమానాలకు దారి తీస్తుంది. తరచూ తన చెల్లెలితో కలిసి ట్రిప్పులు వేసే తాప్సీ కుటుంబంతో వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. 

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన తాప్సీ తెలుగులో సరైన గుర్తింపు లభించడం లేదని బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. అక్కడ అమ్మడుకి అవకాశాలు రావడంతో పాటు నటిగా చక్కటి గుర్తింపు రావడంతో ఇక అక్కడే సెటిల్ అయిపోవాలని ఫిక్స్ అయింది. తెలుగులో అరకొర సినిమాల్లో నటిస్తున్నా.. అమ్మడి పూర్తి ఫోకస్ మాత్రం బాలీవుడ్ మీదే ఉంది. అయితే రీసెంట్ గా తాప్సీ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుందని సమాచారం.

ప్రేమించిన వ్యక్తితోనే తాప్సీ నిశ్చితార్ధం జరిగిందని అంటున్నారు. గతంలో డెన్మార్క్ బ్యాండ్మింటన్ ప్లేయర్ మాథ్యూస్ తో తాప్సీ ప్రేమలో ఉందనే  వార్తలు బాగా వినిపించాయి. వారిద్దరూ ముంబైలో ఓ హోటల్ లో డిన్నర్ చేసి ఒకరి చేతులు మరొకరు పట్టుకొని బయటకు రావడంతో వార్తలు గుప్పుమన్నాయి. మాథ్యూస్ ఆడే టోర్నమెంట్ కు తాప్సీ వెళ్లడం అతడిని ఎంకరేజ్ చేయడం వంటివి చేస్తుంటుంది. ఈ విషయంపై మాథ్యూస్ కు మీడియాలో ప్రశ్నలు ఎదురవ్వగా.. అది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని కామెంట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు.

తాజాగా తాప్సీ, మాథ్యూస్ తో కలిసి గోవాకు వెళ్లింది. అయితే ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా గోవాకు వెళ్లడం అనుమానాలకు దారి తీస్తుంది. తరచూ తన చెల్లెలితో కలిసి ట్రిప్పులు వేసే తాప్సీ కుటుంబంతో వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. అక్కడ కొందరు బంధువుల సంకాశంలో నిశ్చితార్ధం జరుపుకున్నారని టాక్. ప్రస్తుతం సినిమాల పరంగా తనకున్న కమిట్మెంట్స్ పూర్తయిన వెంటనే అతడిని పెళ్లి చేసుకోబోతుందట తాప్సీ. 

loader