ఈ దెబ్బకు అటు ఆక్వామెన్, ఇటు షారూఖ్ డంకీ రెండూ తప్పుకుని దారి ఇచ్చాయి. ముఖ్యంగా  సలార్ దెబ్బకు షారుక్ ఖాన్ డంకీ వసూళ్లకు గండిపడింది. 


ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన సలార్ సినిమా అంచనాలకు తగినట్లుగానే భాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతోంది. ఓపినింగ్ షో నుంచే ఈ సినిమాకు కలెక్షన్స్ పోటెత్తుతున్నాయి. తొలి రోజు సలార్ మూవీకి ఇండియా వ్యాప్తంగా రూ. 95 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ అంటోంది. ఇంక శనివారం, ఆదివారం చెప్పక్కర్లేదు. ఈ వీకెండ్ పూర్తిగా సలార్ కే అంకితం అన్నట్లుగా ఊగిపోతున్నారు. ఈ దెబ్బకు అటు ఆక్వామెన్, ఇటు షారూఖ్ డంకీ రెండూ తప్పుకుని దారి ఇచ్చాయి. ముఖ్యంగా సలార్ దెబ్బకు షారుక్ ఖాన్ డంకీ వసూళ్లకు గండిపడింది. ఈ క్రమంలో ఈ ఊపు సంక్రాంతి సినిమాలు వచ్చేదాకా ఉండేలా ఉందని ట్రేడ్ అంటోంది. దాంతో ఈ మధ్యలో వచ్చే సినిమాలు ని ప్రేక్షకులు పట్టించుకుంటారా లేదా అనేది ఎవరికి అర్దం కావటం లేదు.

మరీ ముఖ్యంగా కళ్యాణ్ రామ్ డెవిల్ డిసెంబర్ 29న వస్తోంది. అలాగే .. అదే రోజున ‘బబుల్‌గమ్’ అనే చిన్న సినిమా వస్తోంది. ఈ రెండు సినిమాలకు దేని ప్రత్యేక దానికి ఉంది. కళ్యాణ్ రామ్ ది పిరియాడిక్ స్పై డ్రామా. ‘బబుల్‌గమ్’ తో సుమ కొడుకు రోషన్ పరిచయమౌతున్నాడు. ఈ సినిమాలు ప్రమోషన్ మెటీరియల్ కు బాగానే రెస్పాన్ వచ్చింది. కానీ ఇప్పుడు ఎటు చూసినా సలార్ మానియానే. దాని ముందు షారూఖ్ వంటి సూపర్ స్టార్ కూడా కనపడటం లేదు. ఈ క్రమంలో ఈ రెండు సినిమాలు ఏ మేరకు భాక్సాఫీస్ దగ్గర ఫెరఫార్మెన్స్ చేస్తాయి..ఓపినింగ్స్ తెచ్చుకుంటాయి..అనేది ప్రశ్నార్దంకంగా మారింది. 

ఇక రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం సలార్. ప్రీ బుకింగ్స్ నుంచే సునామీ క్రియేట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ వీకెండ్ మాత్రమే కాకుండా మరో పదిహేను రోజులు పాటు ఈ సినిమా బాక్సాఫీస్‍ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 

 #Salaar Ceasefire 1 చిత్రం బద్ధ శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథాంశంతో ‘సలార్‌’ రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగాన్ని ‘సలార్‌ పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌’ పేరుతో విడుదల చేసారు. శ్రుతిహాసన్‌ (salaar heroine) హీరోయిన్‌. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రతినాయకుడు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, దర్శకుడు టీనూ ఆనంద్‌, జగపతి బాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘సలార్‌’.. ‘కేజీయఫ్‌’ యూనివర్స్‌ కు సంబంధం ఉండదని సినిమా స్పష్టం చేసింది.

బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అందుకు కారణం ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్. అలాగే ఆయన క్రేజీ కాంబినేషన్స్. ఈ క్రమంలో ఈ డిసెంబర్ లో రాబోతున్న ప్రభాస్ సలార్ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని అంటాయి. ఈ సినిమాకి కేజీఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో, ఖచ్చితంగా ఈ చిత్రం తప్పకుండా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్మకంతో ఉంది ట్రేడ్. అదే నిజమైంది.